వందేళ్ళ తర్వాత ఒకేరోజు రాహువు, కుజుల సంచారం.. త్వరలో వీరింటికి ధనలక్ష్మి!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 12వ తేదీన ఖగోళ దృగ్విషయం ఆవిష్కృతం కాబోతుంది. జనవరి 12వ తేదీన రాత్రి 11 గంటల 52 నిమిషాలకు కుజుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. కుజుడు పునర్వసు నక్షత్రం లోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఇదే సమయంలో రాహువు కూడా నక్షత్ర సంచారం చేయబోతుంది. రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రం లోకి వెళుతున్నాడు.
ఒకేరోజు ఒకే సమయంలో రాహు, కుజ గ్రహాల నక్షత్ర సంచారం
ఇక ఈ రెండు గ్రహాలు కలిసి ఒకే రోజు, ఒకే సమయంలో సంచారం చేయబోతున్నారు. దాదాపు 100 సంవత్సరాల తరువాత రాహువు, కుజగ్రహాలు ఒకేరోజు, ఒకే సమయంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఇక 100 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ఖగోళ దృగ్విషయాలు ముఖ్యంగా కొన్ని రాశులవారికి సానుకూల ఫలితాలనిస్తూ వారి జీవితంలో సంతోషానికి కారణమవుతున్నాయి. మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశి వారికి కుజుడు మరియు రాహువు యొక్క నక్షత్ర సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు ఆర్థికంగా బలోపేతం అవుతారు. వీరికి డబుల్ అదృష్టం వస్తుంది. ఏ పని చేసిన విజయలక్ష్మి వెన్నంటే ఉంటుంది. మేషరాశి వారికి రాహువు, కుజుడు కారణంగా సంపద పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి పేరు ప్రతిష్టలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇది అన్ని విధాలుగా మేషరాశి వారికి శుభాలను చేస్తుంది.
సింహరాశి
వంద సంవత్సరాల తర్వాత రాహువు మరియు కుజ గ్రహాల నక్షత్ర సంచారం సింహరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఏ పని చేసిన విజయవంతంగా పూర్తి చేస్తారు. సింహరాశి జాతకులకు కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో పురోగతి కనిపిస్తుంది. మీరు ఈ సమయంలో కుటుంబంతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి రాహువు మరియు కుజుల నక్షత్ర సంచారం విశేషమైన ప్రయోజనాలను ఇస్తుంది. వీరు తమకు ఎంతో ఇష్టమైన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. ఇది ధనుస్సు రాశి వారికి శుభాలను చేకూర్చే కాలం.
వృషభ రాశి
రాహువు మరియు కుజుడి నక్షత్ర సంచారం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఏ పని చేసిన విజయం వరిస్తుంది. కార్యానుకూలత కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారుల మన్ననలను పొందుతారు. ఇది వృషభ రాశి జాతకులకు అదృష్టాన్ని ఇచ్చే సమయం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుజుడు మరియు రాహువు యొక్క నక్షత్ర సంచారం వృశ్చిక రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి కి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఎప్పటినుంచో పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications