ఏడాది తర్వాత బుధ శుక్ర గ్రహాలు కలిసి ఈ రాశులవారిని కుబేరులను చేస్తున్నాయి!
వేద జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో ఏ గ్రహానికి ఆ గ్రహానికే ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సౌర వ్యవస్థలో ఉన్న అన్ని గ్రహాలు నిర్దిష్ట కాలంలో తమ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాయి. ఇక గ్రహాల గమనం, గ్రహాల సంయోగం వివిధ రాశుల వారి పైన ప్రతికూల లేదా సానుకూల ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. అయితే త్వరలో బుధుడు మరియు శుక్రుడు కలయిక కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని మరియు ఆనందాన్ని కలిగిస్తుంది.
వృశ్చిక రాశిలో బుధ శుక్ర గ్రహాల సంయోగం
అక్టోబర్ 13వ తేదీన శుక్రుడు ఉదయం 5:49 నిమిషాలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆపై అక్టోబర్ 29వ తేదీన 10:24 నిమిషాలకు బుధుడు అంగారక రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశిలో అప్పటికే ఉన్న శుక్రుడుతో బుధుడు సంయోగం చెందుతాడు. సంవత్సరం తర్వాత శుక్ర బుధ గ్రహాల సంయోగం జరుగుతుంది. వృశ్చిక రాశిలో బుధ శుక్ర గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలను కలిగిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో బుధ శుక్ర గ్రహాల సంయోగం లగ్న గృహంలో జరుగుతుంది. ఈ సమయం వృశ్చిక రాశి జాతకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. వివాహితులు జీవితంలో జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
వ్యాపారస్తులకు భారీ ఆర్థిక లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు కెరీర్లో పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో జీతం పెరుగుతుంది. ఆర్థికంగా ప్రగతి సాధిస్తారు. వృశ్చిక రాశి వారు పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు.
తులారాశి
బుధ శుక్ర గ్రహాల సంయోగం కారణంగా తులా రాశి వారికి కలిసొస్తుంది. తులా రాశిలో బుధ శుక్ర గ్రహాల సంయోగం వారి సంపద గృహంలో జరుగుతుంది. ఈ సమయం వీరికి ఎంతో ఫలవంతంగా ఉంటుంది. వర్ధక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. వివిధ ఒప్పందాలు ఈ సమయంలో ఆశించిన లాభాలను ఇస్తాయి.
వీరి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. తులా రాశి వారి కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి. వివాహితులకు ఇది అనుకూలమైన సమయం. వారు జీవితంలో సంతోషాన్ని పొందే సమయం.
మకర రాశి
బుధ శుక్ర గ్రహాల సంయోగం మకర రాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. మకర రాశి వారి లాభగృహంలో బుధ శుక్ర గ్రహాల సంయోగం జరుగుతుంది. దీని కారణంగా మకర రాశి వారు అన్ని రంగాలలోనూ మంచి ఫలితాలను సాధిస్తారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.
మకర రాశి వారి పిల్లలు పురోగతిని సాధించే అవకాశం ఉంది. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల నుండి వీరు లాభం పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మన్ననలు దొరుకుతాయి. షేర్ మార్కెట్లో లాభాలను అర్జించే అవకాశం ఉంది. లాటరీలు కొట్టే ఛాన్స్ కూడా ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications