ఏడాది తర్వాత శుక్రుడి నీచభంగ్ రాజయోగం.. ఈ రాశులవారికి కుబేరయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అనేక రాశుల వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల రవాణా అనేక రాజయోగాలకు కారణంగా మారింది. ప్రస్తుతం శుక్రుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో శుక్ర సంచార సమయంలో నీచభంగ్ రాజ యోగం ఏర్పడింది.
నీచభంగ్ రాజయోగం
ఈ రాజయోగం కారణంగా అనేక రాశులవారికి లబ్ధి జరుగుతుంది .సుమారు సంవత్సరం తర్వాత శుక్రుడు కన్యారాశిలో ప్రవేశించిన సమయంలో నీచభంగ్ రాజయోగం ఏర్పడింది. ప్రస్తుతం దీని ఫలితాలను అనేక రాశులవారు పొందుతున్నారు. మరి ఈ రాజయోగం కారణంగా లబ్ధి పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కన్యా రాశి
కన్యారాశిలో శుక్రుడు లగ్న గృహంలో నీచ భంగ్ రాజయోగం ఏర్పరచాడు. ఈ రాజయోగం కారణంగా కన్యారాశి వారి వ్యక్తిత్వం బాగా మెరుగుపడుతుంది .వివాహితులు తమ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. దీని కారణంగా భాగస్వాములు ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. కెరీర్ లో ప్రమోషన్ వస్తుంది. కన్యారాశి వారు ఈ సమయంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
మకర రాశి
మకర రాశిలోని తొమ్మిదవ ఇంట్లో నీచభంగ్ రాజయోగం ఏర్పడింది. ఈ రాజ యోగం కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో సరైన ఫలాలను పొందగలుగుతారు. మకర రాశి వారి ఆదాయ వనరులు పెరిగి ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి.
ధనస్సు రాశి
ధనుస్సు రాశిలో కర్మ ఇంట్లో శుక్ర సంచారం కొనసాగుతుంది. ధనుస్సు రాశి వారికి ఇది అదృష్ట కాలం. ఇప్పుడు ధనుస్సు రాశి జాతకులు ఏ పని చేసినా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయంలో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు వివిధ ఒప్పందాల నుండి భారీ లాభాలను పొందుతారు .నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ధనస్సు రాశి వారికి ఇది అదృష్ట కాలం. వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి ధనుస్సు రాశి వారికి ఇదే సరైన సమయం. ఈ సమయం ఆర్థికంగాను, అన్ని విధాలుగాను ప్రయోజనకరంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications