సంక్రాంతి తర్వాత మంగళాదిత్య రాజయోగంతో నక్కతోక తొక్కేది వీరే!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక నిర్దిష్ట కాలమానం తర్వాత ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. నవగ్రహాలలో సూర్యుడిని రాజుగా పరిగణిస్తారు. ఇక కుజుడిని ధైర్యానికి కోపానికి ప్రతీకగా చెబుతారు. జనవరి మాసంలో కుజుడు, సూర్యుడు సంక్రాంతి తర్వాత మకర రాశిలో సంయోగం చెంది మంగళ ఆదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తాయి.

మంగళాదిత్య రాజయోగంతో లబ్ధిని పొందే రాశులు
దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి రెట్టింపు లాభాలు వస్తాయి. కెరీర్ లో పురోగతి వస్తుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు, ఆస్తి వృద్ధి జరుగుతుంది. మంగళాదిత్య రాజయోగంతో లబ్ధిని పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

After Sankranthi these zodiac signs are lucky with the Mangaladitya Rajyoga

మేషరాశి
మేష రాశి వారికి మంగళాదిత్య రాజయోగం కారణంగా లబ్ధి చేకూరుతుంది. మేష రాశి వారికి ఈ సమయంలో పురోగతి ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి చేపట్టిన పనులలో విజయం ఉంటుంది. ఈ సమయంలో వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

కన్యారాశి
సూర్య , కుజ కలయిక కన్యారాశి జాతకులకు సానుకూలతలను ఇస్తుంది. కన్యా రాశి జాతకులకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. తెలివితేటలు వృద్ధి చెందుతుంది. ఏ పని చేసిన విజయం వరిస్తుంది. కెరీర్ లో పురోగతి సాధ్యమవుతుంది. ఉన్నతాధికారుల మద్దతు దొరుకుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మకర రాశి
మంగళాదిత్య రాజయోగం కారణంగా మకర రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మకర రాశి వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం, పనితీరు మెరుగుపడుతుంది. అవివాహితులకు వివాహాలకు కుదురుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన లాభాలు వస్తాయి. ప్రతి ప్రయత్నంలోనూ విజయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీన రాశి
మంగళాదిత్య రాజయోగం మీన రాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషం కనిపిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+