చీకటి పడిన తర్వాత ఈ పనులు చేస్తే దరిద్రం పట్టుకుంటుంది
రాత్రిపూట మనం కొన్ని పనులు చేయకూడదని మన పెద్దలు చెబుతారు. జ్యోతిష్య పండితులు, ఇతర శాస్త్రాలు తెలిసినవారి నుంచి వారు నేర్చుకున్నారు. అందుకే పెద్దలు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టకూడదు అంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే రాత్రి వేళ చేయకూడని పనులుంటాయి. అవేంటో తెలుసుకుందాం.
* జుట్టు విరబోసుకొని నిద్రించకూడదు. కొంతమంది మహిళలు రాత్రివేళల్లో జడ అల్లుకోకుండా అలా వదిలేసి పడుకుంటారు. కానీ ఇది చాలా అరిష్టమని పండితులు చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత మన చుట్టూ కొన్ని దుష్టశక్తులు తిరుగుతుంటాయని చాలామంది నమ్ముతారు. జుట్టు విరబోసుకొని నిద్రించడం అశుభానికి సంకేతం.

* వంటగదిని అపరిశుభ్రంగా పెట్టి రాత్రిపూట నిద్ర పోకూడదు. వంటసామాన్లు కడగలేకపోతే వాటిని బయట పెట్టాలి. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మురికి పాత్రలను ఇంట్లో ఉంచకూడదని కొందరికే తెలుసు. అలా చేయడంవల్ల ఆ కుటుంబం అప్పులపాలవుతుందని చెబుతారు. అంతేకాదు.. ఆర్థిక భారం మీద పడుతుంది.
* పంచదారు, ఉప్పు, పాలు, పెరుగు, పసుపుతోపాటు పుల్లటి ఆహారాన్ని దానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత వీటిని దానంచేస్తే ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు. అంతేకాకుండా జీవితంలో అస్తిరత్వం ఉంటుంది.
* రాత్రి సమయంలో గోళ్లు కత్తిరించడం, జుట్టును కత్తిరించడంలాంటివి చేస్తుంటారు. రాత్రివేళల్లో ఈ పనులు అస్సలు చేయకూడదు. దీనివల్ల ఇల్లు అపరిశభ్రంగా తయారవడమే కాకుండా లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని చెబుతారు.
* ఏ ఇంటినైనా ఉదయం సమయంలోనే శుభ్రం చేయడమనేది శుభప్రదమని వాస్తు శాస్త్రంలో ఉంది. సూర్యోదయమైన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడం కుదరకపోతే సూర్యాస్తమయం తర్వాత అసలు ఊడవకూడదు. దీనివల్ల దరిద్రం పట్టుకుంటుందని వాస్తు చెబుతోంది. రాత్రివేళ ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శాంతి, సంతోషానికి సంబంధించి సమస్యలు వస్తాయి.
* రాత్రివేళల్లో బట్టలు ఉతికినా, ఆరబెట్టినా దరిద్రం పట్టుకుంటుందని వాస్తుశాస్త్రం వివరిస్తోంది. సూర్యాస్తమయం తర్వాత దుస్తులను బహిరంగ ప్రదేశాల్లో ఉతకకూడదు. రాత్రివేళ బట్టలను ఆరబెట్టడంవల్ల ఎనర్జీ తగ్గుతుంది. పగటివేళ ఆరబెట్టడం, ఉతకడం చేయడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. సూర్యరశ్మివల్ల హానికర బ్యాక్టీరియా ఉంటే అది చనిపోతుంది. సంసారంలో అశాంతి తలెత్తుతుంది.












Click it and Unblock the Notifications