అప్పులకు స్వస్తి; అష్టైశ్వర్యాలకు ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?

లక్ష్మీ అనుగ్రహం కోసం, అప్పులకు స్వస్తి చెప్పడం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం సకల సంపదలను కలిగిస్తుంది. ఈ ఐశ్వర్య దీపం ఏమిటి? ఐశ్వర్య దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి? ఐశ్వర్య దీపాన్ని ఎలా తయారు చేయాలి? దాని నియమాలు ఏమిటి? అన్న వివరాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఐశ్వర్య దీపాన్ని ప్రతి శుక్రవారం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత వెలిగించిన వారికి ఐశ్వర్యాలు కలుగుతాయి. వృధా ఖర్చు తగ్గుతుంది. సంపద చేతిలో నిలుస్తుంది. వ్యాపారాలు గణనీయంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతున్న వారు, అప్పులపాలై బాధలు పడుతున్న వారు ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే వారికి ఆర్థిక ప్రగతి కలుగుతుంది.

 Aishwarya deepam gives Debt Relief and fills with wealth!!

ఇక ఐశ్వర్యాన్ని అందించే ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలి అంటే ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పెద్ద ప్రమిదలను తీసుకుని వాటికి పసుపు, కుంకుమ రాయాలి. బియ్యం పిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేసి, ఆ ముగ్గులో ఒకదానిపై ఒకటిగా పెట్టి, ఒక పావు కిలో రాళ్ల ఉప్పు వేసి, ఆ రాళ్ళ ఉప్పుపైన పసుపు, కుంకుమ చల్లాలి.

దానిపై ఒక చిన్న ప్రమిదను పెట్టి రెండు వత్తులు ఒకటిగా వేసి దీపం వెలిగించాలి. దీనినే ఐశ్వర్య దీపం అంటారు. ఇక ఐశ్వర్య దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలు, పళ్ళు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా పెట్టి లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని చదువుకోవాలి. కనకధార స్తోత్రాన్ని కూడా చదివితే మంచిదని చెబుతున్నారు.

శుక్రవారం దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు ఆ ప్రమిదల్లో ఉన్న ఉప్పు తీసేసి, ఆ ఉప్పును నీటిలో కలిపి ఎవరూ తొక్కనిచోట పోయాలి. ఇలా 11, 16, 21, 41 శుక్రవారాలు చేస్తే ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కుతారని అంటున్నారు. ఐశ్వర్య దీపంతో ఆర్ధిక సమస్యల నుండి కొంతమేర ఉపశమనం తప్పక లభిస్తుంది. కనుక ఊహించని ఆర్ధిక ఇబ్బందులతో బాధ పడుతున్న వారు ఐశ్వర్య దీపం వెలిగిస్తే మంచిది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+