Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫిబ్రవరిలో అంగారక యోగంతో ఈ రాశులవారికి అన్నీ కష్టాలే!

వేద జ్యోతిషశాస్త్రంలో రాహువు మరియు కుజుడు కలయిక అంగారక యోగాన్ని ఏర్పరుస్తుంది. ఫిబ్రవరి మాసంలో కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అప్పటికే ఉన్న రాహువుతో సంయోగం చెంది అంగారక యోగాన్ని ఏర్పరుస్తారు. అంగారక యోగం జ్యోతిష్య శాస్త్రంలో అశుభ యోగంగా చెబుతారు. ఈ యోగం ప్రభావం వల్ల కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. వారు ఆర్థిక నష్టాలను, ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
అంగారక యోగం ఏర్పడడం వల్ల కర్కాటకరాశి జాతకులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ యోగం మీ రాశిలో 8వఇంట్లో ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు లైంగికవ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో కొత్త పని ఏది చేపట్టకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ చేపడితే నష్టాలను చూడవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.

angarak yoga gives inauspicious results to these zodiac signs

కన్యారాశి
రాహువు మరియు కుజుడు కలయిక కారణంగా ఏర్పడే అంగారక యోగంతో కన్యారాశి జాతకులు నష్టాలను చవి చూస్తారు. ఈ సమయంలో కన్యా రాశి వారికి సంచార చార్ట్ లోని ఆరవ గృహంలో ఈ కలయిక జరగడం వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కోర్టు కేసులలో వైఫల్యాలను చూస్తారు శత్రువులు ఆధిపత్యాన్ని చలాయిస్తారు. రక్త సంబంధిత వ్యాధులు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

మీన రాశి
అంగారక యోగం మీనరాశిలో సంచార చార్ట్ లోని 12వ స్థానంలో ఏర్పడడం వల్ల మీకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఆర్థిక నష్టాలను చవి చూస్తారు. తప్పుడు ఆరోపణలను, వ్యాజ్యాలను ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ సమయంలో మీ తోబుట్టువులతో మీకు కొన్ని విభేదాలు వస్తాయి . ఇది మీ మానసిక స్థితిని కలవర పెడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అజాగ్రత్తగా ఉండకుండా ఉంటే మంచిది.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+