ఏప్రిల్ 17 ధనజ్యోతిష్యం.. శ్రీరామ నవమినాడు ఈ రాశులవారికి ధనలాభం!!
గ్రహాల గమనం బట్టి ద్వాదశ రాశుల వారి జీవితాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈరోజు శ్రీరామనవమి.. హిందువులందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. ఇక ఈరోజు ద్వాదశ రాశుల వారి ధన జ్యోతిష్యం ఏ విధంగా ఉందో, ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
మేషరాశి, వృషభ రాశి
మేష రాశి వారు ఈ రోజు వ్యక్తిగత అవసరాల కోసం కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈరోజు మేషరాశి వారు అంతా గృహ విషయాలపై మీ దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తారు.
వృషభ రాశి వారు ఈరోజు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీరు శక్తిని మరియు ఉత్సాహాన్ని పెట్టుబడిగా పెడతారు. దాని ఫలితాలు రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా అందుతాయి.

మిధున రాశి, కర్కాటక రాశి
మిధున రాశి వారు ఈరోజు ఎక్కువ డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలను పొందుతారు. మీరు మరింత వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ఆలోచన చేస్తారు. ఈరోజు మీ డబ్బులను పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. కర్కాటక రాశి వారు ఈ రోజు ఆర్థిక విషయాలలో సున్నితంగా ఉంటారు. అయితే మీరు ఇతరుల అభిప్రాయాలకు దూరంగా ఉండాలి. మీరు మీ మనసు చెప్పింది మాత్రమే వింటే మంచిది.
సింహరాశి, కన్యారాశి
ఇంటిని నిర్వహించడానికి సింహరాశి జాతకులు ఈరోజు డబ్బును పెట్టుబడి పెట్టాలి అనుకోవచ్చు. మీరు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు ఉత్తమమైన వాటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. కన్యారాశి జాతకులు ఈరోజు మీరు మీ ఆర్థిక విషయాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఈరోజు మీరు మీ స్థాయికి తగ్గ వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బును హఠాత్తుగా ఖర్చు చేస్తారు.
తులారాశి , వృశ్చిక రాశి
తులా రాశి జాతకులు ఈరోజు ఆరోగ్యం కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలోని వారి ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థికంగా ఈరోజు కాస్త ఒత్తిడిగా ఉంటుంది.
వృశ్చిక రాశి జాతకులు ఈరోజు ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులుగా ఉంటారని చెప్పబడింది. ఆర్థిక విషయాలకు సంబంధించిన మీ నిర్ణయాలు చాలా దృఢంగా ఉంటాయి.
ధనుస్సు రాశి, మకర రాశి
ధనుస్సు రాశి వారు ఈరోజు విలువైన వస్తువుల విషయంలో డబ్బుల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. ఆర్థిక విషయాలకు సంబంధించి ఏ పని చేసిన అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి.
మకర రాశి జాతకులు ఈరోజు మనో ధైర్యంతో చేసే పనులు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది .ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కుంభరాశి, మీనరాశి
కుంభ రాశి వారి సమయం, శక్తి మరియు డబ్బు ఈరోజు చాలా తక్కువ ఉత్పాదక కార్యకలాపాలకు వెళ్ళవచ్చు . కానీ మీ పని నాణ్యత మిమ్మల్ని పరిపూర్ణతకు దగ్గర చేస్తుంది. భవిష్యత్ లో లాభాలను ఇస్తుంది.
మీన రాశి వారు ఈరోజు వినోదం, ఆనందం కోసం డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. కీలక సందర్భాలలో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏదైనా కొనేటప్పుడు, ఖర్చు చేసేటప్పుడు ఆలోచించకుండా చేస్తారు జాగ్రత్త.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications