ఏప్రిల్ 8 రాశిఫలాలు.. ఆస్తిని వృద్ధి చేస్తారు
సోమవారం
అమావాస్య తిథి
ఉత్తరాభాద్ర నక్షత్రం
ఫాల్గుణ మాసం
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
తులా రాశి
స్థిరాస్తికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల నుంచి అనుకూలమైన నిర్ణయం వస్తుంది. ఒక సంఘటనవల్ల బాధపడతారు. ఖర్చులు పెరగకూడదు. శివాలయంలో ప్రదక్షిణలు చేయడంతోపాటు శివారాధన, శివాష్టకం పఠించాలి.

వృశ్చిక రాశి
ఈరోజు బాగుంది. మంచి విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివపంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయడంతోపాటు శివ అష్టోత్తర శతనామావళి చదవాలి.
ధనస్సు రాశి
ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. మరింత మెరుగైన ఫలితాల కోసం శివారాధన చేయడంతోపాటు బిల్వాష్టకం పఠించాలి.
మకర రాశి
పనులు వెంటనే పూర్తవుతాయి. కొన్ని విషయాల్లో ధైర్యంగా వ్యవహరించాలి. ఆస్తిని వృద్ధి చేస్తారు. పంచామృతాలతో శివుణ్ని అభిషేకించడంతోపాటు శివ అష్టోత్తర శతనామావళి చదవాలి.
కుంభ రాశి
ముఖ్యమైన పనులు వాయిదా వేయాలి. పనుల్లో ఆటంకాలున్నాయి. బంధుమిత్రులవల్ల ఆటంకాలను అధిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బిల్వాష్టకం చదవడంతోపాటు శివారాధన చేయాలి.
మీన రాశి
ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అవసరానికి సాయం అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో శివుణ్ని పూజించాలి. విశ్వనాథాష్టకం చదవాలి.












Click it and Unblock the Notifications