అర్దాష్టమ శనితో వీరికి ఏడునెలల నరకం.. బయటపడాలంటే
గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా, క్రమశిక్షణకు మారుపేరుగా, న్యాయదేవతగా గుర్తించే గ్రహమైన శనిదేవుడి సంచారం కూడా కొన్ని రాశుల వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. శని దేవుడు రెండున్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో శని దేవుడు మొత్తం 12 రాశులను పూర్తి చేయడానికి సుమారు 30 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం శని దేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు.
వృశ్చిక రాశిలో అర్దాష్టమ శని
కుంభ రాశిలో శని ఉండడం కారణంగా వృశ్చిక రాశిలో అర్ధాష్టమ శని కొనసాగుతుంది. ఈ అర్ధాష్టమ శనిని శని దయ్యా అంటారు. జన్మరాశి నుండి నాలుగవ రాశిలో శని సంచారాన్ని అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని కారణంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం తీవ్రమైన ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి జాతకులు ఈ సంవత్సరం అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకాఏడు నెలల కాలం వీరికి కష్టాలు తప్పవు.

వృశ్చిక రాశి వారికి ఏడు నెలల కాలం కఠినం
అర్ధాష్టమ శని కారణంగా వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఎదురవుతాయి. తీవ్రమైన కలహాలు వస్తాయి. అయితే మళ్లీ ఆఖరి నిమిషంలో అన్ని గొడవలు సర్దుకుంటాయి. శని గ్రహం కుంభరాశి నుండి మీన రాశిలోకి వెళ్లిన తర్వాత అర్ధాష్టమ శని నుంచి వృశ్చిక రాశి వారికి విముక్తి లభిస్తుంది. అర్ధాష్టమ శని ప్రభావం వృశ్చిక రాశిపై ఇంకా 7 నెలలపాటు చాలా కఠినంగా ఉంటుంది.
ఈ విషయాల్లో జాగ్రత్త
దీనివల్ల వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. కెరీర్ లోను కొత్త కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతలోనే సానుకూల మార్పులను కూడా చూస్తారు. సీనియర్లతో, ఉన్నతాధికారులతో వాదనలకు ఈ సమయంలో దూరంగా ఉండాలి. ఇక రాజకీయాలలో ఉండే వారికి ఈ సమయం మంచిది కాదు. వివాదాలకు దూరంగా ఉండాలి.
వృశ్చిక రాశికి వారికి మంచి కూడా
అదే సమయంలో కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఇంటిని పునరుద్ధరించడానికి భూములు లేదా ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఏదైనా ఇనుముకు సంబంధించిన పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. అలాగే ఏ రకమైన రుణాలు తీసుకోవడానికి అయినా ఈ సమయం మంచిది.
ప్రతికూల ఫలితాలనుండి ఇలా బయట పడండి
అర్ధాష్టమ శని కారణంగా ఇబ్బందులు పడే వృశ్చిక రాశి వారు శని ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా ను చదవడం మంచిది. చంద్రబీజ మంత్రాన్ని జపించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. శివ చాలీసాని కూడా చదివితే శని దేవుడు ప్రసన్నమవుతాడు. కష్టాల నుండి ఉపశమనం కలుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications