వినాయక విగ్రహాల ప్రతిష్టకు రెడీ అవుతున్నారా.. లక్ష్మీ కటాక్షం కోసం ఇలా చెయ్యండి!
హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి పండుగ అత్యంత ముఖ్యమైనది. వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండుగ రోజు వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. తొమ్మిది రోజులపాటు వినాయకుడికి వివిధ రకాల నైవేద్యాలతో పూజలు చేసి తొమ్మిది రోజుల తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
వినాయకుడి విగ్రహం వాస్తు నియమాలు
గణేష్ నవరాత్రులు పాటించాలని భావించేవారు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించే క్రమంలో కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెబుతారు. మరి ఆ వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం. ఇంటికి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాలని ఆలోచించేవారు వాస్తు నియమాల ప్రకారం విగ్రహాన్ని ప్రతిష్టిస్తే మంచిది. అప్పుడే గణేశుడి ఆశీర్వాదం మీపై పుష్కలంగా ఉంటుంది.

ఇలాంటి వినాయకుడి విగ్రహమే శుభప్రదం
వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు వినాయకుడి తొండం యొక్క భంగిమ ఏ దిశలో ఉందో గుర్తుంచుకోవాలి. వినాయకుడికి తొండం ఎడమవైపుకు వంగి ఉంటే అది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎడమవైపుకు తొండం వంగి ఉన్న వినాయకుడిని పూజిస్తే మంచిది. అంతేకాదు వినాయకుడి వాహనమైన ఎలుక మరియు మోదకం ఉన్న వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేయాలి.
ఈ రంగు వినాయకుడే శ్రేష్టం
ఎలుక, మోదకం లేకపోతే శుభప్రదంగా ఉండదని చెబుతారు. వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకునేటప్పుడు దాని రంగును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎరుపు రంగు వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టిస్తే కుటుంబ సభ్యుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇక తెలుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే కుటుంబంలోని వారికి ఆనందం కలుగుతుంది.
ఈ దిశలో వినాయకుడిని ప్రతిష్ఠిస్తే శుభం
అంతేకాదు వాస్తు ప్రకారం వినాయకుడు విగ్రహాన్ని తీసుకువచ్చిన తర్వాత ఉత్తర దిశ వైపు వినాయకుడిని ప్రతిష్టించాలి. ఉత్తర దిశకు అభిముఖంగా వినాయకుడు ముఖం ఉండేలా చూడాలి. ఈ దిశను లక్ష్మీదేవికి మరియు శివునికి అంకితం చేసినట్లు చెబుతారు. కాబట్టి గణేశుడు ముఖాన్ని ఈ దిశలో ఉంచితే మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ కలుగుతుందని భావిస్తారు.
వాస్తు నియమాలతో వినాయకుడిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం
ఎవరైతే ఉత్తరం వైపు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించలేరో వారు ఇంటి ప్రధాన ద్వారానికి అభిముఖంగా తూర్పు దిశగా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఇలా వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చే విషయంలో, ప్రతిష్టించే విషయంలో వాస్తు నియమాలను పాటిస్తే వారి ఇంట్లో సంతోషం సంపదలు వెల్లి విరుస్తాయి. కుటుంబ సభ్యులు సంతోషంగా జీవిస్తారు. లక్ష్మీ కటాక్షంతో సిరిసంపదలతో సుఖంగా జీవితం సాఫీగా సాగుతుంది.












Click it and Unblock the Notifications