తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటున్నారా? వాస్తు ఏం చెప్తుందంటే!
వాస్తుశాస్త్ర ప్రకారం తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది? మీ ఇంట్లో తాబేలు బొమ్మను పెట్టుకోవడం వలన మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? వంటి విషయాలను తెలుసుకుందాం.తాబేలు బొమ్మ మీ ఇంటికి సానుకూల శక్తిని ఆకర్షించే విధంగా తోడ్పడుతుంది. ఇతరుల చెడు దుష్ప్రభావం పడకుండా నియంత్రిస్తుంది. మీ మనస్సుకు భంగం కలగకుండా ప్రశాంతతను అందిస్తుంది. మీరు శుభకార్యాలకు బయటకు వెళ్లేముందు తాబేలును చూసి వెళ్ళినట్లైతే మంచి ఫలితాలు వస్తాయి.
మీ వ్యాపార సముదాయాల్లో తాబేలు బొమ్మ
చేసే వ్యాపారంలో లాభాలు పొందాలన్న ఎలాంటి సమస్యలు రాకుండా వ్యాపార రంగంలో రాణించాలన్నా లేదా మీ సొంత ఆఫీసుల కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలి అన్న..మీరు నిత్యం పూజా చేసే పూజ గది లేదా పూజా ప్రాంతంలో తాబేలు బొమ్మను పెట్టుకొని రోజు మీరు పూజా చేసే దేవుళ్ళకు ఏ విధంగా అయితే పూజలు చేస్తున్నారో అదే విధంగా తాబేలు బొమ్మను కూడా పూజించినట్లయితే మీకు అన్ని మంచి ఫలితాలు వస్తాయి.

తాబేలు బొమ్మ ఉంటే సమస్యలకు చెక్
తాబేలు బొమ్మను ఎక్కడ అయిన పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వలన వ్యాపారంలో లాభాలు పొందుతారు. మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే మీ కార్యాలయాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. తాబేలుకు సహనం, ఓపిక, విజ్ఞానం ఉంటుందని చెప్తారు. దీర్ఘాయుష్షుకి మూలం తాబేలు. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతుంది.
దీర్ఘాయుష్షు కోసం తాబేలు బొమ్మ
మీ ఇంటి పూజా గదిలో తాబేలు బొమ్మను పెట్టుకోవచ్చు. తాబేలును నీటితో నిండిన ఇత్తడి పాత్రలో పెట్టుకోవడం ఉత్తమమని చెబుతుంటారు .తూర్పు ,ఉత్తర ముఖం కలిసి ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకొని తాబేలును చందనం, కుంకుమతో అలంకరణ చేసి తాబేలు బొమ్మమీద కొన్ని తులసి రెమ్మలను పెట్టుకోవాలి. ఈ విధంగా పూజ చేస్తే దీర్ఘాయుష్షు పొందుతారు. ఆరోగ్యంగా కూడా ఉంటారు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
తాబేలు బొమ్మను ఈ దిశలో పెట్టుకుంటే మంచిది
జీవితంలో సమస్యలు మనలను వెంటాడుతూ ఉంటాయి. ఆర్ధిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ,కుటుంబ సమస్యలు ఇలాంటి సమస్యలకు వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే మానసిక సమస్యలు తొలగిపోయి ఆర్ధికంగా బలపడతారు. అలానే ఆరోగ్యంగా ఉంటారు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో తాబేలు బొమ్మను ఉత్తర దిశలో పెట్టుకుంటే శుభమని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు .ఉత్తర దిశలో ఉంచుకున్నట్లైతే మీ కెరీర్ బాగుపడుతుంది. మంచి ఫలితాలు పొందుతారు అని అంటున్నారు..
Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
కర్కాటకరాశి వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారం.. అన్నింటా విజయం! -
వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది తెలుసా? -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
ఇంటికి వాస్తు దోషాలుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేయండి -
today rashiphalalu: నేడు బృహస్పతి, బుధుల స్థానాలలో మార్పు.. వీరికి జాక్ పాట్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications