వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి కన్నెర్ర, జాగ్రత్త!
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అయిన ఈరోజు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి మహిళలందరూ సిద్ధమయ్యారు. ఇప్పటికే అందుకు కావలసిన సామాను, సరంజామా సిద్ధం చేసుకున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలోమహిళలు శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. ఈ రోజు మహిళలు పెద్ద సంఖ్యలో వరాలిచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మీ దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి వరాలను ఇవ్వమని కోరుతారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.
వరలక్ష్మీ వ్రత విధానం
నేడు వరలక్ష్మీ వ్రతం చేస్తున్న మహిళలు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతం చేసే మహిళలు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానమాచరించి ఇంటికి ఈశాన్యంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టాలి. చక్కగా ఇల్లంతా శుభ్రంచేసి, స్నానంచేసి, వరలక్ష్మీ వ్రతానికి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత మండపంలో బియ్యం పిండితో ముగ్గువేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో అమ్మవారి ఫోటోనుగానీ, విగ్రహాన్ని కానీ ప్రతిష్టించుకుని పూజలు చెయ్యాలి.

వరలక్ష్మీ వ్రతం .. పూజ ఎలా చేస్తేనే ఫలితం
వరలక్ష్మీ వ్రతం చేసే వారు తప్పనిసరిగా వ్రత నియమాలను పాటించాలి. వ్రతాన్ని ఆచరించడానికి పూజా సామాగ్రి, పసుపు గణపతిని, అక్షింతలను, తోరాలను ముందే సిద్ధం చేసుకొని పూజకు ఉపక్రమించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి, అమ్మవారికి ఇష్టమైన పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలీ. పూజ ముగిశాక ముత్తయిదువులకు పసుపు, కుంకుమలను ఇచ్చి, పండు, తాంబూలంతో ముత్తయిదువుల నుండి ఆశీర్వాదం తీసుకుని పూజను పూర్తి చేయాలి.
వరలక్ష్మీ వ్రతం చేసుకునే వారు చేయకూడని తప్పులు ఇవే
ఇక వరలక్ష్మీ వ్రతం చెయ్యాలనుకునే వారు కచ్చితంగా నియమనిష్టలు ను పాటించాలి. వరలక్ష్మీ వ్రతం ఆచరించేవారు అస్సలు చెయ్యకూడని కొన్ని పనులను తెలుసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం చేస్తున్న ఇళ్లలో చేయకూడని తప్పులు చేస్తే లక్ష్మీ దేవికి ఆగ్రహం వస్తుంది, కాబట్టి పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. వరలక్ష్మీ వ్రతం నాడు పొరపాటున కూడా కోపతాపాలకు పోకూడదు. ఎవరిని తిట్టకూడదు.
వరలక్ష్మీదేవి పూజలో ఇది మరిచిపోతే ఫలితం ఉండదు
ఎప్పుడూ వరలక్ష్మీ వ్రత కలశాన్ని గాజు ప్లేట్ లో పెట్టకూడదు. వెండి ప్లేట్ లో కానీ, రాగి ప్లేట్లలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఏ పూజకైనా వినాయకుడిని ముందుగా పూజించడం ఆనవాయితీ, అలాగే ఇక వరలక్ష్మీ వ్రతం నాడు ముందు పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతనే, లక్ష్మీదేవి పూజ చెయ్యాలి. గణపతి పూజ చేయకుండా లక్ష్మీ పూజ చేస్తే ఫలితం ఉండదు.
వరలక్ష్మీ వ్రత పూజలు తప్పక గుర్తుంచుకోవలసినవి ఇవే
ప్రతి ఒక్కరూ వరలక్ష్మీ అమ్మవారి పూజలో భాగస్వాములు కావాలి. అందరూ అమ్మవారిని అంతే భక్తి శ్రద్ధలతో పూజించాలి. మనసులో భక్తి లేకుండా ఏదో నామమాత్రపు పూజలు చేయకూడదని చెబుతున్నారు. ఇది కేవలం ఆడవాళ్ళ పూజనే మాకేం సంబంధం లేదు అన్నట్టు ఏ ఒక్కరు ఉండకూడదు. ఇంట్లో భార్య భర్తలు ఇద్దరూ వరలక్ష్మీ అమ్మవారిని నిష్టతో పూజించాలి. ప్రతి సంవత్సరం చేస్తున్నాను కాబట్టి తప్పదు అన్న భావనతో పూజలు చెయ్యకూడదు. మనస్ఫూర్తిగా అమ్మవారి పైన పరిపూర్ణమైన భక్తితో పూజలు చేయాలి.












Click it and Unblock the Notifications