అటాచ్డ్ బాత్రూమ్ లు వాడుతున్నారా? ఈ వాస్తు దోషాలుంటే సర్వనాశనమే!
ఇల్లు ఎప్పుడైనా వాస్తు నియమాలను అనుసరించి నిర్మాణం చేసుకోవాలి. వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఉండే గదులు అన్నీ వాస్తుకు అనుకూలంగానే నిర్మించుకోవాలి. అయితే అటాచ్డ్ బాత్ రూమ్స్ విషయంలో కూడా వాస్తు వర్తిస్తుంది. వాస్తు శాస్త్రంలో ఇంటి అటాచ్డ్ టాయిలెట్ నిర్మించటం కోసం కొన్ని నియమాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాస్తు నియమాలు పాటించకుండా అటాచ్డ్ బాత్ రూమ్స్ నిర్మిస్తే కచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అటాచ్డ్ బాత్ రూమ్ ల విషయంలో పొరబాట్లు చేస్తే జరిగే అనర్దాలివే
అటాచ్డ్ టాయిలెట్లు నిర్మాణంలో చేసే పొరపాట్లు, వాటి వినియోగంలో చేసే వాస్తు దోషాలు మనకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. వాస్తు నియమాలు పాటించకుండా నిర్మించే అటాచ్డ్ టాయిలెట్స్ డబ్బు వృధాకు దారితీస్తాయి. అటాచ్డ్ టాయిలెట్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఆ ఇంటికి పేదరికం వస్తుంది.

అటాచ్డ్ బాత్ రూమ్ ఈ దిశలోనే ఉండాలి
వాస్తు ప్రకారం ఏ దిశలో ఉండాలో ఆ దిశలో మాత్రమే నిర్మించాలి. గృహనిర్మాణం చేసేటప్పుడు పడకగదిని నైరుతి మూలలో నిర్మించడం మంచిది. అలా నిర్మిస్తే ఇంట్లో వారికి శుభాలు చేకూరుతాయి. అయితే ఈ పడకగదికి అటాచ్డ్ బాత్‌రూమ్ నిర్మించాల్సి వచ్చినప్పుడు తూర్పు వైపుగా దక్షిణపు గోడను ఆనుకుని ఉండే విధంగా బాత్‌రూమ్ నిర్మాణం చెయ్యాలి. ఇలా నిర్మించిన బాత్‌రూమ్‌లోని దక్షిణగోడకు వెంటిలేటర్ నిర్మించాలి.
అటాచ్డ్ బాత్ రూమ్ ఇలా ఉండకూడదు
బాత్‌రూమ్‌కు వాయువ్యంలో తలుపును బిగించాలి. అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అటాచ్డ్ బాత్రూం నీట్ గా లేకపోతే, ఆ బాత్రూం అటాచ్ గా ఉన్న గదిలో నిద్రించే వారి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. మురికిగా ఉన్న బాత్రూమ్ మనకు పేదరికం తెచ్చి పెడుతుంది. ఇక ఆ గదిలో పడుకునే వ్యక్తి యొక్క నిద్ర చెడిపోతుంది.
అటాచ్డ్ బాత్ రూమ్ విషయంలో ఇలా ఉంటే గొడవలు
ఇక అంతే కాదు అటాచ్డ్ బాత్రూమ్ లు ఉన్నవారు ఎప్పుడూ ఆ బాత్రూమ్ తలుపులను తీసి ఉంచటం మంచిది కాదు. బాత్రూం తలుపులను ఎప్పుడూ మూసే ఉంచాలి. తెరచి ఉంచటం వాస్తు దోషంగా పరిగణించబడుతుంది. ఇక బాత్ రూమ్ ఉన్న వైపు కాళ్ళు పెట్టి పడుకోవటం మంచిది కాదు. అలా బాత్ రూమ్ వైపు కాళ్ళు పెట్టి పడుకుంటే ఆ ఇంట్లో భార్యా భర్తల మధ్య సంబంధాలు చెడిపోయి వివాదాలు వస్తాయి. ఇది ఆ ఇంటి ప్రశాంతతను నాశనం చేస్తుంది.
అటాచ్డ్ టాయిలెట్ విషయంలో వాస్తు దోషాలుంటే కష్టాలు, ఆర్ధిక నష్టాలు
అటాచ్డ్ బాత్రూంలో ఎప్పుడూ లోపల పగిలిపోయి, ట్యాప్ లు లీక్ అవుతూ ఉండకూడదు. ఇక అటాచ్డ్ బాత్ రూమ్ శిథిలమైపోయి ఉన్నా మంచిది కాదు . ఒకవేళ అలా ఉంటే తీవ్రమైన కష్టాలు, ధన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అటాచ్డ్ బాత్రూం లో పొరబాటున కూడా చెత్తాచెదారం జమ చెయ్యకూడదు. దాని ప్రభావం మన జీవితం పైన కచ్చితంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications