ఆషాఢమాసం 2024: ఆషాఢమాసంలో వచ్చే పండుగలు, ఉపవాసాల పూర్తి జాబితా ఇదే!!
హిందూమతంలో ఆషాఢ మాసానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసం చైత్రం, వైశాఖం, జేష్ట మాసాల తర్వాత వచ్చే నాలుగవ నెలగా చెప్పబడుతుంది. ఆషాఢ మాసం రుతుపవనాలు ప్రారంభాన్ని సూచిస్తుంది. మతపరమైన దృక్పణంలో ఆషాడ మాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ఆషాఢ మాసం ప్రారంభం అప్పుడే
ఆషాడ మాసం జూన్ 23వ తేదీన ప్రారంభమై జూలై 21వ తేదీ నాడు ముగుస్తుంది. ఈ మాసంలో విష్ణువుని, శివుడిని పూజించడం వల్ల పు ఆషాఢణ్యం వస్తుందని చెబుతారు. ఇక ఆషాఢ మాసంలో ప్రధానంగా ఉపవాసాలు చేసే రోజులు, వచ్చే పండుగలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఆషాఢ
ఆషాఢ మాసంలో జూన్ 25వ తేదీన సంకష్టహర చతుర్థి పండుగను నిర్వహిస్తాం. జులై రెండవ తేదీ యోగినీ ఏకాదశి, జులై మూడవ తేదీ ప్రదోష వ్రతం, జులై 4వ తేదీ మాస శివరాత్రి, జులై 5వ తేదీ ఆషాఢ అమావాస్య జరుపుకుంటాం. జులై 7వ తేదీ జగన్నాధ రథయాత్ర, జూలై 16వ తేదీ కర్క సంక్రాంతి, జూలై 17వ తేదీ దేవశయని ఏకాదశి లేదా ఆషాడ ఏకాదశి జరుపుకుంటాం.
ఆషాఢ మాసంలోనే చాతుర్మాసం ప్రారంభం
జూలై 18వ తేది ప్రదోష వ్రతం, జూలై 21వ తేదీ గురుపూర్ణిమ లేదా ఆషాఢ పూర్ణిమ వ్రతాన్ని జరుపుకుంటాం. హిందూమతంలో ఆషాఢమాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి, ఆషాఢ మాసంలో శ్రీమహావిష్ణువును, శివుడిని అలాగే లక్ష్మీదేవిని, సూర్యభగవానుని పూజించడం చాలా మంచిదని చెబుతారు. ఇక హిందూమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన చాతుర్మాసం కూడా ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతుంది.
ఆషాఢమాసంలో చెయ్యాల్సిందిదే
ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి, స్నానాధికాలు పూర్తి చేసి, సూర్యునికి అర్ధాన్ని సమర్పించి పూజలు చేస్తే, అనారోగ్యాల నుండి ఉపశమనం పొందుతారు. ఇక ఆషాఢ మాసంలో విష్ణువుకు లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులను, తామర పువ్వులను సమర్పించి పూజించడం వల్ల వారి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉంటాయని చెబుతారు. అంతేకాదు ఆషాఢ మాసంలో దానధర్మాలు చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతారు. కాబట్టి ఆషాఢమాసానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి పూజలు చేసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications