సర్వతంత్ర స్వతంత్రతం: మన నుంచి మనకు స్వాతంత్ర్యం!

హైదరాబాద్: స్వాంతంత్ర్యం ఆంగ్లేయుల నుండీ పొందినందుకు మనం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం.

నిజానికి ప్రతి వ్యక్తికీ తన మనసు నుండీ స్వాతంత్ర్యం లభించాలి..!!
తనదైన స్వీయ తంత్రం అర్ధం చేసుకోగల సత్తా కావాలి..!!
స్వయం కోసం మనం వెతకటం మొదలెడితే ....మనది కాని మనో పాలనా వ్యవస్థ ... నుండీ విడుదల లభిస్తుంది..!!
నిజానికీ ప్రతి వ్యక్తీ... తాను పుట్టినప్పుడు.. మాత్రమే సర్వ స్వతంత్రుడు..!!

క్రమేపీ తన ఉనికి ని నిలుపుకోవటం కోసం ఎన్నో ఆధారాలను చేసుకుని తనను తాను వదిలేసుకున్న స్వయం.....ఒక నేనుగా తయారవుతోంది..!!ఈ క్రమంలో తన స్వచ్ఛతలో ఎన్నో ముద్రలను ప్రతిబింబిస్తూ...తన స్వీయ ధర్మ చక్రాన్ని,తన స్వతంత్రతను కోల్పోయింది...!!
తిరిగీ తన స్వతంత్రతను సాధించటం అంటే అహం బ్రహ్మాస్మిన్ .. అయమాత్మా బ్రహ్మ ...అను సత్యాలను అవగాహన చేసుకోవటమే..!!
అప్పుడు మాత్రమే మనో బుద్ధి చిత్తాలనే విదేశీ పరిపాలన నుండీ విముక్తి లభిస్తుంది..!!

astrologer told the story about freedom of a man

అసలైన మైత్రి సర్వ జీవరాశుల తోనూ సమకూరుతుంది..!!
సరియైన ...కల్మషరహితమైన ప్రేమ ఆహ్లాదకరమైన వెన్నెలలా విరబూస్తుంది..!!
చక్కని మహా కరుణ అను స్వీయ సంపద...ఈ పృథ్వీ పై ప్రతి వ్యక్తి నుండీ,మహా సూర్య ప్రభా కిరణ ప్రసరణ వలె జాలువారుతుంది..!!!
పర పాలన నుండీ స్వతంత్రం సంపాదించిన వారు మన పూర్వీకులు..అంటే మన జన్యువులకు పరపాలన పీడన లేదు కానీ,నేను అనుకుంటున్న ...మనసూ,బుద్ధీ...చిత్తముల పరపాలన....స్వయం మీద ఇంకా ఉండనే ఉంది..!!
అది మనకు బాహ్యంలో పరిస్థితులను సృజిస్తోంది..!!

ఈ అలనాటి స్వాతంత్ర్య దినోత్సవ సంరంభంలో...మన స్వయం తంత్ర స్వతంత్ర తను మనం మనం విధిగా గుర్తు చేసుకుందాం..!!
చేయవలసింది...రాస్తారోకోలూ..ఉప్పు సత్యాగ్రహాలూ కాదు...!!
స్వయాన్ని దేహంతో... మనసుతో.. జోడిస్తూ ఉన్న శ్వాసను నిరంతరం గమనించటం తో..!!!

దేవుడైన జీవుడిని జీవునిగా జీవింప చేస్తూ,జీవుడిని దేవుడిగా పరిమారుస్తూ ఉన్న నీ శ్వాసతో కలసి ఉండటం...!!!

సర్వ తంత్ర స్వతంత్రతను మనకు అందించేందుకున్న అతి తేలికైన ఋజువైన శ్వాస మీద ధ్యాసతో...కలసి ఉండటం...!

సనాతన సాధన ను సనూతనంగా వ్యక్తి గతంగా ప్రతి వ్యక్తీ ఆచరిస్తూ,నవ్య నూతనంగా కనిపింప చేసే స్వయం ప్రకాశాన్ని... భారతీయ ...సాప్రదాయంగా ప్రభవింపచేసుకోవటం...స్వతంత్ర తను సాధించటం...!!!

అదే నీపట్ల నీవు మహా కరుణను ప్రకటించటం..!!

అదే నీవీ లోకానికి మహా ప్రభా పూర్ణ దివ్య తేజంగా వికసించటం..!!

సర్వతంత్ర స్వతంత్రతను సాధించటం...!!

*ఆనంద స్వతంత్ర్య దినోత్సవ
శుభాకాంక్షలు..!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+