ఫిబ్రవరి 13 నుంచి 6 రాశులు ధనవంతులవుతున్నారు
ఈనెల 13వ తేదీన జ్యోతిష్యం ప్రకారం చాలా కీలకమైన రోజు. ఆరోజు గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనికి అధిపతి శనిదేవుడు. ఈ ప్రభావంతో కొన్ని రాశులు జీవితంలో ఎన్నడూ పొందని అద్భుతమైన ప్రయోజనాలను పొందుతున్నారని, అంతేకాకుండా సమాజంలో గౌరవం, హోదా దక్కుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే వివరాలను తెలుసుకుందాం.
సింహ రాశి
వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలున్నాయి. దాంపత్య జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. వీరికి కెరీర్ చాల కొత్తగా ప్రారంభమవుతుంది.

ధనుస్సు రాశి
సమావేశాల్లో పాల్గొనేవారికి సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. విద్యార్థులు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఆర్థికంగా వీరికి అనేకరకాల మేలు కలుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
కుంభ రాశి
నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పనుల్లో కీలకమైన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారాలు చేయాలనుకునేవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. సూర్యుడు, శని ప్రభావంతో వీరికి ఊహించనిస్థాయిలో లాభాలుంటాయి.
తులా రాశి
మీడియా, మార్కెటింగ్, డిజైన్, కళలకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు చదువు బాగా అబ్బుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి అన్నీ కలిసివస్తాయి. పనితీరుకు ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. ఈ రాశివారికి అనేక ప్రయోజనాలు దక్కుతాయి.
మేష రాశి
ఉద్యోగస్థులకు వేతనాలు పెరుగుతాయి. అదనంగా ఆదాయం సమకూరుతుంది. సీనియర్ల నుంచి జూనియర్లకు కార్యాలయాల్లో మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి.
మిథున రాశి
పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. చేసే పనిలో పదోన్నతి ఉంది. ప్రయాణాలు చేసేవారికి మంచి లాభాలు కలుగుతాయి. సూర్యుడి ప్రభావంతో ఈ రాశివారికి అదృష్టం రెట్టింపు అవుతుంది.












Click it and Unblock the Notifications