Astrology: జులైలో ఈ రాశులవారికి తీవ్ర ఆర్ధిక కష్టాలు.. జాగ్రత్త!!

జులై నెలలో ప్రధాన గ్రహాల సంచారం వల్ల అని రాశిచక్రాల వారి జాతకంలో అనేక కీలక మార్పులు సంభవించనున్నాయి. జులై వివిధ రాశి ఫలాల వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని రాశుల వారు అనుకూలమైన ఫలితాలను, మరికొన్ని రాశులవారు ప్రతికూల ఫలితాలను అనుభవిస్తారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిలో సవాళ్ళను ఎదుర్కొనే రాశుల వారు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.

వృషభ రాశి:జులై నెల 6 రాశుల వారికి ఆర్థిక కష్టాలను సూచిస్తుంది. వీరంతా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వృషభ రాశి వారికి జులై నెల జాతకం ప్రకారం ఆర్థిక కష్టాలు ఉండవచ్చునని చెబుతున్నారు. పన్నెండవ ఇంట్లో బృహస్పతి రాహు కలయిక వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Astrology: Financial difficulties for these zodiac signs in July.. beware!!

ఊహించని విధంగా వారి ఖర్చులు పెరుగుతాయి అని చెబుతున్నారు. వారి నెలవారీ బడ్జెట్ ను ప్రభావితం చేసే విధంగా ఈసారి ఖర్చులు ఉంటాయని, వ్యాపారంలో కూడా వృషభ రాశి వారు ఈ సమయంలో నష్టాలను చవిచూడాల్సి వస్తుందని, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.

కన్యారాశి:2023 నెల వారి జాతకం ప్రకారం కన్య రాశి జాతకులు అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉందని, దీని వల్ల ఆర్థిక భారం పెరుగుతుందని చెబుతున్నారు. అప్పులు చేసే పరిస్థితి కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు. అనవసరమైన అవసరాలను తీర్చడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటారని హెచ్చరిస్తున్నారు. డబ్బు ఆదా చేయడం ఈ నెల వరకు సవాల్ గా మారుతుందని, వ్యాపారాల్లో కూడా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

వృశ్చిక రాశి :వృశ్చిక రాశి వారికి జులై నెలలో ఖర్చులు పెరగడం వల్ల బడ్జెట్ దెబ్బతింటుంది. వారు నియంత్రణ లేని విధంగా ఖర్చు చేస్తారని చెబుతున్నారు. వృశ్చిక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు తీసుకోవద్దని సూచిస్తున్నారు. శని యొక్క వైరుధ్య స్థితివల్ల కుటుంబ ఖర్చులు పెరుగుతాయని అంటున్నారు. ఆరోగ్య సంబంధిత ఖర్చులకు కూడా ఆర్థికపరమైన శ్రద్ధ అవసరం అని సూచిస్తున్నారు.

కుంభరాశి:కుంభ రాశి జాతకులకు ఈ నెలలో కేతువు మరియు శని యొక్క అననుకూల స్థానాల కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ నెలలో ఖర్చులను విపరీతంగా చేయవలసి వస్తుంది. స్థిరమైన ఆర్థిక పరిస్థితిని కొనసాగించటం ఇబ్బందులు రావచ్చు. మనీ మేనేజ్మెంట్ చేయలేకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టాలను కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మకర రాశి:మకర రాశి జాతకులకు ఈ నెలలో విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి. ఈ నెలలో బడ్జెట్ ప్లాన్ వీరికి కష్టతరంగా మారుతుంది. నియంత్రణ లేకుండా ఖర్చులు పెరుగుతాయి. ఈ నెలలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడం మానుకోవాలని సూచించబడింది. ఒకవేళ పొరపాటున ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటే అవి ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

కర్కాటక రాశి:కర్కాటక రాశి జాతకులకు బృహస్పతి రాహు అనుకూల స్థానం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది. ఏదైనా కొత్త వ్యాపారం వెంచర్లు, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడం మానుకోవాలని సూచించబడింది. ఎందుకంటే అవి కూడా ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+