మార్చిలో మహాలక్ష్మి రాజయోగం.. ఈ రాశుల సుడి తిరిగింది
వచ్చే నెలలో గ్రహాల సంయోగం పరంగా ఖగోళంలో మంచి పరిణామాలు సంభవిస్తాయి. కుజుడు, చంద్రుడి కలయిక వల్ల మార్చిలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కుజుడు ధైర్యాన్ని కలిగిస్తాడు.. చంద్రుడు మనసుకు కారకుడు. ఈ రెండు గ్రహాలు కలవడంవల్ల 16వ తేదీ నుంచి ఏర్పడే మహాలక్ష్మీ రాజయోగంతో అదృష్టవంతులు కాబోతున్న రాశుల వివరాలను తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణంలో గడుపుతారు. కెరీర్ పరంగా మీకు సానుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సంపాదన కూడా ఊహించనిరీతిలో పెరుగుతుంది.

ధనస్సు రాశి
కుటుంబ జీవితంలో అపార్థాలుంటే అవన్నీ పరిష్కారమవుతాయి. కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడంద్వారా జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ఆకస్మికంగా ధనలాభం ఉంది. పెద్ద సమస్యలను చాలా సులువుగా పరిష్కరించుకొని మంచి పేరు తెచ్చుకుంటారు.
వృషభ రాశి
ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వ్యక్తులకు అదనపు ఆదాయం కోసం మార్గాలు దొరుకుతాయి. పలు ప్రయోజనాలను అందుకుంటారు. కొత్త ప్రణాళికతో జీవితంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో అధిక సమయం గడుపుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా చాలా బాగుంటారు.
కర్కాటక రాశి
గతంలో రచించుకున్న ప్రణాళికల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వాటిల్లో మార్పులు చేస్తారు. ఉద్యోగస్థులకు వేతనాలు పెరగడంతోపాటు పదోన్నతులున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సన్నిహితులు, స్నేహితుల మద్దతుతో మానసికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు.












Click it and Unblock the Notifications