Astrology: శని తిరోగమనంతో పాటు కేతు సంచారం: ఈ రాశుల వారికి శుభాలు.. మీరున్నారా?
జూన్ 17 వ తేదీన శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనంలో వెళుతుంది. రాబోయే ఆరు నెలల పాటు తన సొంత రాశిలోనే శని ఉంటుంది. ఈ సమయంలో శనితో పాటు మరో రెండు గ్రహాలు కూడా తిరోగమనంలో కదులుతాయి. కాబట్టి రాబోయే ఆరు నెలల్లో మూడు గ్రహాలు తిరోగమన కదలికలో ఉంటాయి.
జూన్ నుండి నవంబర్ వరకు గ్రహాల యొక్క తిరోగమన సంచారం కారణంగా సింహ రాశితో సహా 4 రాశుల వారు వృత్తి వ్యాపారాలలో, ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా ఉండడం అవసరం . అయితే ఇదే సమయంలో మరో 4 రాశుల వారికి కేతు సంచారం లాభాలను చేకూరుస్తుంది.

సహజంగా కేతు సంచారం ఆశుభాలను కలిగిస్తుందని అంటారు. కానీ కేతు సంచారం కొన్ని రాశులకు శుభాలను చేకూరుస్తుంది. మేష రాశిలో కేతు సంచారం శుభప్రదంగా కనిపిస్తుంది. మేష రాశిలో కేతు సంచారం వల్ల కచ్చితంగా దాని సానుకూల ప్రభావాలను అనుభవిస్తారు. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ఆదాయ వనరులు విస్తరిస్తాయి. ఏ పని చేసినా వారికి అదృష్టం అండగా మారుతుంది. కేతు సంచారం కుటుంబ సౌఖ్యాన్ని కలిగిస్తుంది.
కర్కాటక రాశి వారికి కూడా కేతు సంచారం అదృష్టాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి జాతకులకు కేతు సంచారం అదృష్టాన్ని తెస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కర్కాటక రాశి జాతకులకు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకుంటే అది కార్య రూపం దాలుస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కలిసొస్తాయి.
వృశ్చిక రాశి జాతకులకు కేతు సంచారం కలిసొస్తుంది. వృశ్చికరాశి వారి జాతకంలో పదకొండవ ఇంట్లో కేతువు సంచరించడం వల్ల వారు శుభవార్తలను అందుకుంటారు. ధనుస్సు రాశి జాతకులకు కేతు సంచారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చూసేవారు కేతువు సంచారంతో ఉద్యోగాలను పొందుతారు. అప్పుల బాధ నుండి ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులకు ఉపశమనం లభిస్తుంది .చట్టపరమైన వివాదాలు పరిష్కరించడతాయి. అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications