కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది
గ్రహాలకు బుధుడు రాకుమారుడు. తెలివితేటలకు, వ్యాపారానికి, లెక్కలకు, తర్కానికి కారకుడు. బుధుడు సంచారం చేస్తే కొన్ని రాశులకు అద్భుతంగా కలిసివస్తుంది. జాతకంలో శుభస్థానంలో బుధుడు ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. ఈనెల 25వ తేదీన బుధుడు తన కక్ష్యను మార్చుకొని దక్షిణ దిశగా పయనిస్తాడు. ఈ మార్పు చాలా కీలకమైంది. ఆరోజు నుంచి కొన్ని రాశులు బాగా లాభపడనున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
కన్యారాశి
కొత్త ప్రణాళికలు రచించుకొని ముందుకు సాగుతారు. అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. మీడియాకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారు, రచనకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి అనుకోకుండా ధనలాభం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. అవి కూడా కలిసివస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. ఊహించనిరీతిలో ప్రయోజనాలు కలుగుతాయి.

మీన రాశి
పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. ఆహ్లాదకరంగా జీవితాన్ని గడుపుతారు. అనుకున్న పనుల్లో ఊహించనిరీతిలో విజయాలు పలకరిస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి వాటి నుంచి భారీ మొత్తంలో లాభాలు రాబడతారు. మానసికంగా, శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆధ్యాత్మికంగా సాధన చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృషభరాశి
కొత్తగా పెట్టే పెట్టుబడుల నుంచి భారీ లాభాలున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు పదోన్నతులు పొందుతారు. డబ్బులు భారీ మొత్తంలో సంపాదిస్తారు. నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. కెరీర్ పరంగా, వ్యాపారం పరంగా మంచి పురోగతి ఉంది.
కర్కాటక రాశి
వ్యాపారస్తులు మంచి విజయాలు సాధిస్తారు. వ్యక్తిగతంగా వీరికి మంచి పేరు వస్తుంది. వివాదాలన్నీ తొలగిపోతాయి. చదువుతో సంబంధం ఉన్న వ్యక్తులు, విద్యారంగంలో ఉన్నవారికి మంచి మేలు కలుగుతోంది. శుభవార్తలను వింటారు. ఉద్యోగస్థులకు కొత్త అవకాశాలు వస్తాయి.












Click it and Unblock the Notifications