astrology predictions 2023: ధనుస్సు రాశివారికి పట్టిందల్లా బంగారమే.. కానీ వాళ్ళు జాగ్రత్త!!

ధనుస్సు రాశి వారికి 2023 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? 2023 ధనుస్సు రాశి వారికి లాభిస్తుందా? వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కుటుంబ జీవనం ఏ విధంగా సాగుతుంది? వారికి వృత్తి వ్యాపారాలలో కలిసొస్తుందా ? వంటి అనేక వివరాలను ఈరోజు మనం తెలుసుకుందాం.

ధనుస్సు రాశి వారికి అంతా శుభమేనా?

ధనుస్సు రాశి వారికి అంతా శుభమేనా?

ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా శుభంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 2023 సంవత్సరంలో ధనుస్సు రాశిని పాలించే గ్రహం బృహస్పతి కావడంతో శుభఫలితాలను ఆశించవచ్చు అని చెబుతున్నారు. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారు జీవితంలో చాలా శుభవార్తలు వింటారు అని, కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలను సాధిస్తారని సూచించబడింది. ధనస్సు రాశి జాతకులు ఈ సంవత్సరం ఎక్కువగా ప్రయాణాలు చేస్తారని విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పబడింది.

ధనుస్సు రాశి వారి కెరీర్ ఇలా

ధనుస్సు రాశి వారి కెరీర్ ఇలా


ధనుస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు మీకు విజయాన్ని సూచించినప్పటికీ, మార్పుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ నుండి ఆగస్టు నెల వరకు ఉద్యోగ మార్పులను నివారించాలని సలహా ఇవ్వబడింది. ఉద్యోగం మారాలి అనుకునేవారికి అక్టోబర్ నుండి డిసెంబర్ నెల వరకు అనుకూలంగా ఉంటుందని, అప్పుడు ఉద్యోగం మారితే వారికి ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుందని సూచించబడింది.

ధనుస్సు రాశి వారి ఫలితం విద్యార్థులకు ఇలా

ధనుస్సు రాశి వారి ఫలితం విద్యార్థులకు ఇలా


ధనుస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరం విద్యలో అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనుస్సురాశి జాతకులు విద్యార్థులుగా ఉంటే వారిపై చెడు స్నేహితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. విద్యకు సంబంధించి ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఏకాగ్రతకు భగ్నం కలిగి, విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని సూచించబడింది. ముఖ్యంగా 2023 సంవత్సరం ధనుస్సు రాశి జాతకులైన విద్యార్థుల చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.

ఆర్ధికంగా ధనుస్సు రాశి వారికి ఇలా ఉంటుంది

ఆర్ధికంగా ధనుస్సు రాశి వారికి ఇలా ఉంటుంది


ధనుస్సు రాశి జాతకులకు 2023 సంవత్సరం ఆర్థికంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేని సంవత్సరంగా చెప్పవచ్చు. ధనస్సు రాశి వారు 2023 లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలను కలిగి ఉన్నారు. 2023 చివరిలో ఆర్థిక విషయాల్లో ధనస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉన్నందున డిసెంబర్ నెలలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.

వ్యాపారాల్లో ధనుస్సు రాశి జాతకులకు అనుకూలంగా ఉందా ?

వ్యాపారాల్లో ధనుస్సు రాశి జాతకులకు అనుకూలంగా ఉందా ?

ధనస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరం వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో ఆశించిన మేర విజయాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో వ్యాపారం మంచి రాబడిని తీసుకువస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి సెప్టెంబర్ నెల వరకు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అయితే సెప్టెంబరు నెల, అక్టోబరు నెలలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపార భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. ఇక డిసెంబర్ నెలలో వ్యాపారం అనుకూలంగా ఉంటుంది.

వాహనాలు, ఆస్తులు కొనుగోలు చెయ్యటానికి అనుకూలమా ?

వాహనాలు, ఆస్తులు కొనుగోలు చెయ్యటానికి అనుకూలమా ?

ధనుస్సు రాశి జాతకులకు 2023 సంవత్సరం వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉండే సంవత్సరం. జనవరి నుండి ఏప్రిల్ నెల మధ్య వరకు ఎటువంటి ఆస్తులు కొనుగోలు చేయాలన్నా అనుకూలంగా ఉంటుంది. ఇక వాహన యోగం కూడా ఈ సంవత్సరం ధనుస్సు రాశి జాతకులకు ఉంది. ఇక ఆ తర్వాత నుండి సెప్టెంబర్ వరకు చాలా కష్ట సమయంగా కనిపిస్తుంది. ఎటువంటి ఆస్తి వ్యవహారాలలో వేలు పెట్టకుండా ఉండడమే మంచిదని సలహా ఇవ్వబడింది. ఆపై అక్టోబరు నుండి పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని, నవంబరు డిసెంబరు నెలల్లో కొత్త వాహనం, లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉందని సూచించబడింది.

ధనుస్సు రాశి వారి ఆరోగ్యం ఇలా

ధనుస్సు రాశి వారి ఆరోగ్యం ఇలా

ధనుస్సు రాశి జాతకులకు 2023 లో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని సూచించబడింది. ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పబడింది. కొన్ని ఉదర సంబంధమైన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని, ఆరోగ్య సమస్యలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పబడింది ముఖ్యంగా ఏప్రిల్ నెల నుండి అక్టోబర్ నెల వరకు మీరు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని సూచించబడింది. మంచి దినచర్యను పాటించడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, సమయానుకూలంగా పనిచేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు అని సలహా ఇవ్వబడింది.

వైవాహిత జీవితం ఎలా ఉంటుందంటే

వైవాహిత జీవితం ఎలా ఉంటుందంటే

ఇక ధనుస్సు రాశి జాతకుల వైవాహిక జీవితం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం 2023 లో లేదని చెప్పబడింది. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఒకరిపై ఒకరు సామరస్య భావన ఈ సంవత్సరం ప్రధానంగా కనిపిస్తుంది. మీ పనులలో జీవిత భాగస్వాముల మద్దతు మీకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఈ సంవత్సరం జీవిత భాగస్వామి యొక్క మంచి స్వభావం, ప్రవర్తన మీకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడపడానికి ఈ సంవత్సరం మీకు ఎంతో అనుకూలంగా ఉందని చెప్పబడింది. కుటుంబ జీవితంలో శాంతి మరియు సఖ్యత ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.

disclaimer: ఈ కథనం జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+