Astrology: శని, రాహు, కేతువుల తిరోగమన ప్రభావం: ఈ రాశుల వారికి కష్టకాలం!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 17 నుండి కుంభరాశిలో శని తిరోగమనం మొదలవుతుంది. శని తో పాటు రాహుకేతువులు కూడా తిరోగమనంలో పయనిస్తాయి. ఈ మూడు గ్రహాల తిరోగమన చలనం అన్ని రాశుల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ముఖ్యంగా 3 నిర్దిష్ట రాశి చక్రాల వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని, వారు ఆరోగ్య, ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

శని, రాహువు, కేతువు తిరోగమనంలో ప్రయాణించటం వల్ల జీవితంలో చెడు పరిణామాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా సింహరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారు కష్ట కాలాన్ని ఎదుర్కోవాల్సిన సమయమిది. సింహరాశి జాతకులకు ఈ సమయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రావు. వారు నిరాశ చెందే పరిస్థితి ఎదురవుతుంది. అంతేకాదు ఉద్యోగంలో కూడా అనేక మార్పులు రావచ్చు. అయితే ఈ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి.

 Astrology

వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన డబ్బు సరైన సమయానికి చేతికి రాక పోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది చట్టపరమైన సాంకేతిక సవాళ్లు కూడా ఆందోళన కలిగించవచ్చు. అందుకే సింహ రాశి వారు ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నందున వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరిగా చెప్పబడింది.

శని, రాహు, కేతువుల తిరోగమన చలనం కర్కాటక రాశి వారికి ప్రతికూల పరిస్థితులకు కారణమవుతుంది. ఈ సమయంలో జీవితంలోని అనేక అంశాల విషయంలో ఒత్తిడికి గురవుతారు. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఇది మీపై ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఇక రుణాలు ఉన్నవారికి అది భారం గా మారే ప్రమాదం ఉంది. పొరపాటున కూడా ఈ సమయంలో ఎవరికి అప్పు ఇవ్వకండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సి వస్తుంది.

శని, రాహువు, కేతువు తిరోగమనం వల్ల వృశ్చిక రాశి వారికి కష్టాలు వచ్చి పడతాయి. అసలు ఈ సమయంలో అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక గందరగోళానికి కారణమౌతుంది. వ్యాపార భాగస్వాములతో విభేదాలు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండటం మంచిది. బలమైన భాగస్వామ్యాలను నిర్వహించడం ద్వారా ఈ సమయంలో మీరు మనశ్శాంతిగా ఉండటానికి అవకాశం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+