Astrology: శని, కుజుడు కలిసి సంసప్తక యోగం: ఈ రాశులవారికి అప్పటినుండి కష్టాలు.. జాగ్రత్త!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. జులై 1వ తేదీన కుజ గ్రహం సింహ రాశి లోకి ప్రవేశిస్తుంది. కుజ గ్రహం సింహ రాశిలో ప్రవేశించడం జులై 1వ తేదీన శనివారం అర్ధరాత్రి ఒంటిగంట యాభై రెండు నిమిషాలకు జరుగుతుంది.
ఇక ఈ సమయంలోనే శని, కుజుడు కలిసి సంసప్తక యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. వారు అనుకోని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారు దీని వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మేష రాశి: మేష రాశి వారికి శని, కుజుడు ప్రభావంతో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరి వ్యక్తిగత జీవితంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ప్రేమ జీవితం కూడా ప్రతికూలంగానే ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి: కన్యారాశి జాతకులకు శని, కుజుడు ప్రభావం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కన్య రాశి జాతకులు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. విపరీతంగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మరి కొంత కాలం సమయం పడుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఆందోళన, ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
కర్కాటక రాశి: కర్కాటక రాశి జాతకులు కూడా కుజుడు, శని ప్రభావంతో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ చిన్న పొరపాటు చేసినా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇతరులతో వాదించడం మానుకోవాలి. మీరు మీ సంబంధాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.
మీన రాశి: మీన రాశి జాతకులకు కుజుడు, శని సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో అనుకున్న పనులను పూర్తి చేయాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. ఉద్యోగులు కార్యాలయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. విద్యార్థులు విద్య పై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాల్సి ఉంటుంది. కుజుడి ప్రభావంతో అహంకారం పెరిగి జీవితంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మకర రాశి: మకర రాశి జాతకులకు కుజుడు, శని గ్రహాల ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరిగి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. విలాసాల కోసం అనుకోకుండా ఎక్కువ ఖర్చు చేస్తారు. వాహనాలు నడిపే విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో ఎవరు జోక్యం చేసుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో అశాంతి నెలకొని, ఇంట్లో పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉంటాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications