astrology: మే నెలలో శనిజయంతి.. శని దుష్ప్రభావం పోవాలంటే చెయ్యాల్సిందిదే!!
ఈ సంవత్సరం మే నెలలో శని జయంతి వస్తుంది. శని జయంతి రోజు కొన్ని పనులు చేస్తే జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. జేష్ఠ మాసంలో అమావాస్య తిథి నాడు శనిదేవుని జన్మదినాన్ని జరుపుకుంటారు. శని దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల శని దేవుడి దుష్ప్రభావాల నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం మే 19వ తేదీన శని జయంతి జరగనుంది. ఈరోజు ఎవరైతే శనిదేవుని నిష్ఠతో పూజిస్తారో, ఆయనకు ఇష్టమైన పనులు చేస్తారో వారి జీవితంలో ఉన్నటువంటి సమస్త బాధలను శని దేవుడు దూరం చేస్తారు. శనిదేవుని జయంతి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుందని, సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

ఈ ఏడాది మే 18 రాత్రి 09:44 నుండి మే 19 రాత్రి 9: 20 నిమిషాల వరకు శని జయంతి సమయంగా పండితులు చెబుతున్నారు.ఇక శని దేవుడి పూజించడానికి మే 19 రోజున ఉదయం 7:11 నుండి రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు శుభ సమయం అని చెబుతున్నారు. ఈ శుభ సమయంలో శనిదేవుని పూజించినట్లయితే ఆయన అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.
ఇక ఇదే సమయంలో శని జయంతి రోజు దానం చేయడం కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శని జయంతి నాడు శనిదేవుడి మంత్రాన్ని జపిస్తూ దానధర్మాలు చేయడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు, కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు శని జయంతి రోజున నల్లటి వస్తువులు దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు.
నల్లని వస్త్రాలు, నల్ల బూట్లు, నువ్వులు, ఇనుము, నువ్వుల నూనె వంటి వస్తువులను దానం చేయడం వల్ల శనిదేవుడు ప్రీతి చెంది మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగిస్తాడు. కాబట్టి శని జయంతి యొక్క మహత్యాన్ని తెలుసుకొని ఆరోజు కచ్చితంగా శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నియమనిష్టలతో పూజలు చేయాలి. నల్లటి వస్తువులు దానం చేయాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications