Astrology: ఏప్రిల్ నెలలో ముఖ్యగ్రహాల రవాణా.. ఏం జరగబోతుంది అంటే!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గ్రహాల రవాణా కారణంగానే మన జీవితంలో జరిగే అనేక సంఘటనలు, మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశికి కదులుతున్న గ్రహాలు వివిధ రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులకు కారణమవుతాయి. ఇక ఏప్రిల్ నెలలో ముఖ్యమైనటువంటి గ్రహ రవాణాలు ఏమిటి? ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం.

బుధుడు, సూర్యుడు, శుక్రుడు, కుజ గ్రహాలు ఏప్రిల్ నెలలో తమ రాశులను మార్చుకోబోతున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారికి జీవితం అద్భుతంగా మారుతుంటే, మరికొన్ని రాశులవారికి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 2వ తేదీన మేషరాశిలో బుధుడు తిరోగమనం చెందుతున్నాడు.

Astrology The transit of major planets in April What is going to happen

మళ్లీ ఇదే నెలలో ఏప్రిల్ నాలుగవ తేదీన బుధుడు అస్తంగత్వం దశలోకి వెళతాడు. మేషరాశిలో బుధుడు దహనం అవుతాడు ఆ తరువాత ఏప్రిల్ 9వ తేదీన మీన రాశిలోకి వెళ్లిన బుధుడు తిరోగమనంలో ప్రయాణిస్తాడు. ఆపై ఏప్రిల్ 19వ తేదీన, మీన రాశిలో బుధుడు ఉదయిస్తాడు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో బుధుడి తిరోగమనం, అస్తంగత్వం, ఉదయించడం ప్రధానమైన గ్రహ పరిణామంగా చెప్పాలి.

ఇక ఏప్రిల్ 13వ తేదీన మేషరాశిలో సూర్య సంచారం జరుగుతుంది. మే 14 వరకు అక్కడే ఉండి తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు . మేషరాశిలో సూర్య సంచారం కారణంగా బృహస్పతి తో కలయిక జరుగుతుంది. దీని ఫలితంగా అనేక రాశుల వారికి శుభాలు చేకూరుతాయి.

ఏప్రిల్ 24వ తేదీన మేష రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. ఆపై శుక్రుడు మేషరాశిలో మే 19వ తేదీ వరకు ఉండి, అక్కడ బృహస్పతి తో సంయోగం చెంది శుభ యోగాలను ఏర్పరుస్తారు. ఇక ఏప్రిల్ 23వ తేదీన మీన రాశిలో అంగారక సంచారం జరుగుతుంది. ఇక ఈ గ్రహ సంచారం కూడా అనేక రాశుల వారికి మేలును, కొన్ని రాశుల వారికి కీడును కలిగిస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+