Astrology: దురదృష్టం వచ్చే ముందు ఈ 5 సంకేతాలు కనిపిస్తాయట!!
ప్రతిరోజు పగలు రాత్రి వస్తూ పోతూ ఉంటాయి అలాగే జీవితంలో సంతోషం, దుఖం కూడా కలగలిసి ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ మంచి సమయాలు వస్తాయి, చెడు సమయాలు వస్తాయి. మన జీవితంలో మంచి జరిగేటప్పుడు మంచి జరుగుతుందని సంకేతము, చెడు జరుగుతున్నప్పుడు చెడు జరుగుతుంది అన్న సంకేతం వస్తుంది. అయితే మనం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాలి.
అదృష్టం ఏ విధంగా అయితే చెప్పే వస్తుందో, దురదృష్టం కూడా అదేవిధంగా చెప్పే వస్తుంది. దురదృష్టం రావడానికి ముందు ఓ ఐదు సంకేతాలు మనకి కనిపిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. చాలామంది ఇళ్లల్లో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పూజలు చేస్తారు హారతి ఇస్తారు. హారతి సమయంలో దీపం ఆరిపోతే చెడు కాలం రాబోతుందని చెబుతారు .

ఇంట్లో తులసి మొక్క ఎంత పచ్చగా ఉంటే ఆ కుటుంబంలో అంత ఆనందం, ఐశ్వర్యం ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతారు. అయితే తులసి మొక్క అకస్మాత్తుగా వాడిపోవడం ప్రారంభిస్తే, ఎండిపోతుంటే త్వరలో చెడుకాలం రాబోతుందని, దురదృష్టం వెంట పడుతుందని చెబుతారు. జ్యోతిష్య శాస్త్రంలో బంగారాన్ని పోగొట్టుకోవడం శ్రేయస్కరం కాదు. బంగారు వస్తువులు అకస్మాత్తుగా పోతే ఇంట్లో చాలా సమస్యలు ఉండబోతున్నాయని అర్థం.
కాబట్టి బంగారం పోవడం మనకు చెడు దినాలు రాబోతున్నాయని చెప్పడానికి సంకేతం.నెయ్యిని శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు అలాంటి నెయ్యి చేతిలో నుంచి హఠాత్తుగా జారి కింద పడిపోతే మంచిది కాదని చెబుతున్నారు. నెయ్యి చేతుల నుండి జారి కింద పడిపోవడం చెడు కాలానికి సంకేతమని చెబుతున్నారు.
అంతేకాదు ఇంట్లోకి ఎలుకలు రావడం చాలా సర్వసాధారణమైన విషయమే అయినప్పటికీ ఇంట్లోకి పెద్ద సంఖ్యలో నల్ల ఎలుకలు రావడం ప్రారంభిస్తే అది అరిష్టమని, ఏదో పెద్ద సంక్షోభం మీకోసం ఎదురు చూస్తుందని చెబుతున్నారు. కాబట్టి మన జీవితంలో చెడు దినాలు రాబోతున్నాయని ఈ సంకేతాలు చెబుతాయి.
-
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!!












Click it and Unblock the Notifications