నేడు ఈ రాశులవారి అదృష్టం మెరుస్తుంది.. మీరున్నారా?
ఈరోజు శుక్రవారం. జూలై 7వ తేదీ. ఈరోజు అనేక రాశుల వారి జీవితాలు అదృష్టాన్ని చూడనున్నాయి. నేడు ఆ అదృష్ట రాశులు ఏమిటో మనం ప్రస్తుతం తెలుసుకుందాం. ఈరోజు మేష రాశి, వృషభ రాశి, కన్యారాశి, ధనుస్సు రాశి, తులారాశి, కుంభ రాశి జాతకులకు అదృష్టం కలిసొస్తుందని, వారు ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మేష రాశి
మేష రాశి వారు ఈ రోజు సంతోషంగా గడుపుతారని పనుల్లో విజయం సాధిస్తారని చెబుతున్నారు. ఈరోజు సామాజిక కార్యక్రమాలలోనూ, స్నేహితులతోనూ కలిసి గడుపుతారని చెబుతున్నారు. పిల్లల నుండి శుభ వార్తలు వింటారు అని, పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి అవకాశం ఉంటుందని, డబ్బు ఖర్చు అయినప్పటికీ సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు నేడు శుభ దినం అని చెబుతున్నారు. ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించగలరని, ఉద్యోగస్తులకు ఈరోజు బాగుంటుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లకు సంబంధించిన శుభ వార్తలు వింటారు అని చెబుతున్నారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుందని, అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయని, ఉన్నతాధికారుల ప్రోత్సాహం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని చెబుతున్నారు.
కన్యారాశి
కన్య రాశి జాతకులు ఈరోజు ప్రశాంత జీవితాన్ని గడుపుతారు. ఈరోజు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారని, ఉద్యోగ లాభదాయకంగా ఉంటుందని, అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అని చెబుతున్నారు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని పనిలో విజయం సాధిస్తారని చెబుతున్నారు .ఉద్యోగులు మరియు సహోద్యోగుల మద్దతు లభిస్తుందని చెబుతున్నారు.
తులారాశి
తులారాశి జాతకులు ఈరోజు నూతన ఉత్సాహంతో ఉంటారని, ప్రియమైన వారితో సమావేశం ఉత్సాహంగా సాగుతుందని, నేడు సృజనాత్మక ఆలోచనలు చేయడానికి మంచి రోజు అని చెబుతున్నారు. అయితే మితిమీరిన ఆలోచనలు చేయడం, చర్చలలో లోతుగా వెళ్లడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఈరోజు పిల్లల పురోగతి బాగా ఉంటుందని చెబుతున్నారు.

కుంభరాశి
కుంభ రాశి జాతకులు ఈ రోజు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారని, బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారని చెబుతున్నారు. శారీరక, మానసిక ఉల్లాసంతో వారు, పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శిస్తారని చెబుతున్నారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు నేడు ప్రశాంతంగా, సంతోషంగా గడపాలని కొత్త పనులు ప్రారంభిస్తారు అని చెబుతున్నారు. ఇక ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితుల రాక సంతోషాన్ని కలిగిస్తుందని ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. తోబుట్టువులతో సఖ్యత సంతోషాన్ని కలిగిస్తుందని, అదృష్టాన్ని పెంచుకోవడానికి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications