Astrology: మే నెలలో ముఖ్య గ్రహాల సంచారం.. శుభయోగాలతో అద్భుత ఫలితం
2024 సంవత్సరం మే మాసం.. ఈ ఏడాది మే మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో మనం అత్యంత ఇష్టంగా జరుపుకునే అక్షయ తృతీయ, బుద్ధ పూర్ణిమ వంటి పండుగలు వస్తున్నాయి. అంతేకాదు ఈ మాసంలో అనేక కీలక గ్రహాల సంచారం జ్యోతిష్య పరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ద్వాదశ రాశుల వారి జాతకాలలో గ్రహాల రవాణా కారణంగా అనేక సానుకూల, ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి.
మే నెలలో కీలక గ్రహాల రవాణా
ఈ నెలలోనూ అనేక గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జాతకాలు మారనున్నాయి. ఇక ఈ ఏడాది మనిషి జీవితం పైన ప్రభావం చూపించే గ్రహాల సంచారం మే నెలలో కీలకం కానుంది. అన్ని రాశులపైన ప్రధాన గ్రహాల సంచార ప్రభావం పడనుంది. ఇక మే నెలలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది?ఏ గ్రహం ఏ రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది? దాని వలన ఎలాంటి ప్రభావాలు చోటు చేసుకునే అవకాశం ఉంది వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

12 ఏళ్ళ తర్వాత వృషభరాశిలోకి బృహస్పతి
మే 2024లో జరిగే గ్రహ సంచారాలు చాలా ముఖ్యమైనవి. ఈ నెలలో అత్యంత ముఖ్యమైన గ్రహాలైన సూర్యుడు, బుధుడు, శుక్రుడు, బృహస్పతి సంచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. మే 1వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల 29 నిమిషాలకు వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తుంది. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తుంది.
వృషభరాశిలో బృహస్పతి సంచారంతో ఈ రాశులకు లబ్ది
బృహస్పతి వృషభ రాశి సంచారం ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. ముఖ్యంగా మేష రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి జాతకులకు ఈ సంచారం కలిసొస్తుంది. ఆపై మే మూడవ తేదీన వృషభ రాశిలో బృహస్పతి దహనం జరుగుతుంది.
ముఖ్య గ్రహాల రవాణాతో విశేష యోగాలు
తరువాత మే 10వ తేదీన సాయంత్రం 6 గంటల 39 నిమిషాలకు బుధుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. మే 14వ తేదీన వృషభ రాశిలో సూర్య సంచారం జరుగుతుంది. మే 14వ తేదీన 5 గంటల 41 నిమిషాలకు సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక మే 19వ తేదీన 8 గంటల 29 నిమిషాలకు శుక్రుడు ప్రవేశించి మాళవ్య రాజయోగం ఏర్పరుస్తాడు.
ఈ రాశులకు మే నెలలో అదృష్టం
ఇక వృషభ రాశిలో మూడు రాశుల కలయిక వల్ల త్రి గ్రాహి యోగం ఏర్పడుతుంది. మొత్తం ద్వాదశ రాశులలో ఐదు రాశుల వారికి మే నెల ముఖ్యమైన గ్రహ సంచారం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులా రాశి, మీన రాశి జాతకులకు కలిసొస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
జన్మ నక్షత్రం ఆశ్లేష, మఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం -
రేపటి నుంచే గ్రహాల జాతర! 60 ఏళ్ల తర్వాత నింగిలో అరుదైన దృశ్యం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!












Click it and Unblock the Notifications