Astrology: మిధునరాశిలో సూర్యుని సంచారం: ఈ రాశులకు అదృష్టం; మీరూ ఉన్నారా?
2023 సంవత్సరంలో సూర్యుడు, శని, బుధుడు, బృహస్పతి ఇలా అనేక ముఖ్య గ్రహాలు రాశీ చక్రాలను మార్పు చేస్తున్నాయి. వీటి ప్రభావం వల్ల 12 రాశుల వారి జీవితాలలో విభిన్న మార్పులు వస్తాయి. గ్రహాల సంచారం కొన్ని రాశులకు సానుకూల ఫలితాలను ఇస్తే, మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి.
ఈ సంవత్సరం మిధున రాశిలో సూర్యుడు సంచారం ప్రతి రాశి పై, ముఖ్యంగా మిధున రాశి పై ప్రభావం చూపుతుంది సూర్యుడు జూన్ 15వ తేదీన సాయంత్రం 6గంటల 7నిమిషాలకు మిధున రాశిలో సంచరిస్తాడు. మిధున రాశిలో ఒక నెల రోజుల పాటు ఉండి తదనుగుణంగా ఇతర రాశిచక్రాలపై ప్రభావం చూపిస్తాడు. ఇక సూర్యుడు మిధున రాశిలో సంచారం వల్ల మూడు రాశుల వారి జీవితాలలో అదృష్టం వచ్చి పడుతుంది.

మిధున రాశిలో సూర్యుడు సంచారం వల్ల మూడు రాశుల వారికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా మిధున రాశి, తులా రాశి, కుంభ రాశి జాతకులకు సూర్యుడి సంచారం వల్ల మేలు కలుగుతుంది. మిధున రాశిలో సూర్యుడు సంచారం వల్ల కుంభ రాశి జాతకులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక రంగంలో లాభాలు చేకూరుతాయి. ఆరోగ్యకరమైన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించటానికి ఇది సరైన సమయం.
జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు చేయాలని భావిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. మిధునరాశిలో సూర్యుడు సంచారం వల్ల మిధున రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మిధున రాశి జాతకులు ఉద్యోగంలో టీం ప్లేయర్ గా వ్యవహరిస్తారు. సహోద్యోగుల నుంచి ప్రశంసలను పొందుతారు. ఏ పని చేసినా విజయాలను సాధిస్తారు. ఆర్ధిక స్థితి కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలమైన సమయం.
మిధున రాశిలో సూర్యుడు సంచారం వల్ల తులా రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు ఉంటుంది. కుటుంబం నుంచి జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారాన్ని పొందుతారు. ఈ సమయంలో ఆదాయాలు పెరుగుతాయి. మంచి లాభాలను కూడా ఆర్జిస్తారు. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications