Astrology: అక్టోబర్ లో విధ్వంసక యోగం: ఈ రాశులవారికి ప్రమాదాలు, వ్యాధులు.. జాగ్రత్త!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు అక్టోబర్ 2వ తేదీన తులా రాశిలో ప్రవేశించాడు. అప్పటికే అక్కడ కేతు గ్రహం ఉండడంతో, తుల రాశిలో అంగారకుడు కేతువుల యొక్క కలయిక వల్ల ప్రమాదకరమైన విధ్వంసక యోగం ఏర్పడింది. శనితో కలిసి అంగారకుడు, కేతువు ఈ సమయంలో త్రిభుజం గా ఏర్పడనుండడంతో అత్యంత ప్రమాదకరమైన విధ్వంసక యోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది.

విధ్వంసక యోగం కారణంగా 12 రాశుల వారి పైన ప్రభావం ఉంటుంది. విధ్వంసక యోగం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలను ఎదుర్కొంటారు. విధ్వంసక యోగం సమయంలో వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభరాశి వారికి కూడా తమ ఆరోగ్యం పట్ల, వాహనాలను నడపడం పట్ల జాగ్రత్త వహించాలి. మిధున రాశి వారు ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి వారు ఆహారం మరియు మద్యపానం విషయంలో జాగ్రత్త వహించాలి.

Astrology: Vidhvansak yoga in October: Dangers and diseases for these zodiac signs.. beware!!!!

కర్కాటక రాశి వారు ఈ సమయంలో తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వారు ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. వారి రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా జాగ్రత్త వహించాలి. కన్యా రాశి వారికి విధ్వంసక యోగం నష్టం చేస్తుంది. కన్యా రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు .విధ్వంసక యోగం వల్ల వారికి పాత రోగాలు మళ్ళీ తిరగబెడతాయి.

తులారాశి వారు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.తులా రాశి వారు ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలని సూచించబడింది. వృశ్చిక రాశి వారికి విధ్వంసక యోగం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి కాబట్టి వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇవ్వడం మానుకోవాలి.. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.

మీన రాశి వారి విధ్వంసక యోగం సమయలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ సమయంలో డబ్బు నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉండడంతో ఎటువంటి అప్పు ఇవ్వకూడదని చెప్పబడింది.అత్యంత ప్రమాద కరమైన విధ్వంసక యోగంతో అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+