రాశిఫలాలు: యోగం బాగుంది.. డబ్బు చేతికి అందుతుంది

జ్యోతిష్య శాస్త్రంలో రాశి ఫలితాలను నక్షత్రాల గమనం ఆధారంగా పండితులు చెబుతుంటారు. ఈ వారం ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ఇబ్బందులేమైనా ఉంటే వాటిని ఎలా పరిష్కరించాలి? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా చేసుకొని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఈనెల 27వ తేదీ నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తులరాశి: ఉద్యోగంలో మంచి ఫలితాలతోపాటు వ్యాపారంలో లాభాలుంటాయి. అన్నివైపుల నుంచి విజయమే కనపడుతోంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అదృష్టం తోడుంటుంది. పనుల్లో విజయం లభిస్తుంది. ఆంజనేయస్వామి సందర్శనం మనశ్శాంతినిస్తుంది.

august 27th to sepetember 2nd weekly horoscope

వృశ్చిక రాశి: పట్టుదలతో చేసే పనులే విజయానికి మూలమని గుర్తిస్తారు. ఖర్చులు పెరగనివ్వొద్దు. అలాగే వ్యక్తిగత విషయాలను కొత్తవారికి చెప్పవద్దు. ఒక వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో అభినందనలు అందుకుంటారు. సూర్యాష్టకం పఠించాలి.

ధనుస్సు: ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూలంగా తీసుకోవాలి. ప్రతిభను అందరూ మెచ్చుకుంటారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. సమస్యను పరిష్కరిస్తారు. కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. పనిలో సత్ఫలితాలు వచ్చేంతవరకు కష్టపడాల్సి ఉంటుంది. ఇష్టమైన దైవాన్ని ఆరాధించాలి.

మకర రాశి: అపార్థాలకు ఎటువంటి అవకాశం ఇవ్వొద్దు. ఒత్తిడి లేకుండా ఉండాలంటే ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకోవాలి. దైవబలం ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో ఎదురయ్యే విఘ్నాలను సకాలంలో పనిచేయడంద్వారా అధిగమంచాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. శనిదేవుడి దర్శనం సత్ఫలితాన్నిస్తుంది.

కుంభరాశి: మనోబలంతో పనులు చేయాలి. ఆవేశం పనికిరాదు. సహనంతో సకాలంలో చేసే పని విజయాన్నిస్తుంది. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు చిన్న పొరపాటు లేకుండా చూసుకోవాలి. లేదంటే శ్రమ ఎక్కువవుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

మీనరాశి: కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది. వస్త్ర, వస్తు, వాహన ప్రాప్తి ఉంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటే బ్రహ్మాండమైన భవిష్యత్తును పొందుతారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+