చంద్రగ్రహణానికి ముందు శక్తివంతమైన శనిత్రయోదశి..వీరు నక్కతోక తొక్కుతున్నారు!
త్వరలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. వందేళ్ల తర్వాత సంపూర్ణ రాహుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతున్న వేళ దీని ఫలితం ఏ విధంగా ఉంటుందో అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆదివారం రోజు సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి పూట సంభవించనున్న ఈ రాహు గ్రహ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ద్వాదశ రాశులవారి జీవితాలపైన కచ్చితంగా ఉంటుంది. రాహుగ్రస్త చంద్రగ్రహణానికి ఒకరోజు ముందు శనివారం రోజున శని త్రయోదశి ఏర్పడుతుంది.
శనీశ్వరుని అనుగ్రహంతో కొన్ని రాశులవారికి అదృష్టం
ముఖ్యంగా శనివారం నాడు చంద్రగ్రహణానికి ముందు ఏర్పడుతున్న ఈ శని త్రయోదశి చాలా పవర్ఫుల్ శని త్రయోదశిగా చెబుతున్నారు. ఏలినాటిశని, అర్ధాష్టమశని, అష్టమ శనితో బాధపడేవారు ఈ రోజున కొన్ని రెమెడీలు పాటిస్తే శనిదోషాలు, చెడు ప్రభావాలు తొలగిపోతాయని చెబుతున్నారు.సెప్టెంబర్ 6వ తేదీన శనివారంరోజు శని త్రయోదశి రావడం వల్ల శనీశ్వరుని అనుగ్రహంతో కొన్ని రాశులవారు అదృష్టాన్ని పొందబోతున్నారు. మరి ఆ అదృష్టరాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

సింహరాశి
సింహ రాశి వారికి శని సానుకూల ప్రభావం పెను మార్పులకు కారణమవుతుంది. సింహరాశి జాతకులు ఉద్యోగంలో స్థిరత్వంతో పాటు, ప్రమోషన్లు కూడా పొందుతారు. చేసే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో సింహ రాశి వారికి ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. సమాజంలో మీరు మాట్లాడిన మాటలు చెల్లుబాటు అవుతాయి. అన్ని పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు.
వృశ్చిక రాశి
శని త్రయోదశి కారణంగా వృశ్చిక రాశి జాతకులు మంచి ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినవారు లాభాలు గడిస్తారు. సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమవుతాయి. అనుకోని విధంగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు.
మీన రాశి
శని త్రయోదశి కారణంగా మీనరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది. ఏ పని చేసిన సానుకూల ఫలితాలు వస్తాయి. శని వల్ల వీరి జీవితంలో ఊహించని గొప్ప స్థానాలకు వెళతారు. వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది. అన్ని విధాల శని మీకు మంచి చేస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications