మూడురోజుల్లో వీళ్ళకు డబ్బుల మూటలు తెస్తున్న అద్భుత యోగం!
సెప్టెంబర్ మాసం చాలా ప్రత్యేకమైన మాసం. ఈ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలలో మార్పులకు కారణమవుతుంది. ఇక సెప్టెంబర్ 23వ తేదీన చాలా పవర్ఫుల్ అయిన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ భద్ర మహాపురుష రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొన్ని రాశులవారు ప్రతికూల ఫలితాలను చూడవలసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
భద్ర మహాపురుష రాజయోగం
సెప్టెంబర్ 23వ తేదీన కన్య రాశిలోకి బుధ గ్రహ ప్రవేశం జరిగినప్పుడు భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా ఈనెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు నాలుగు రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ రాశిలో అయినా బుధుడు కేంద్ర స్థానాలలో 1, 4, 7, 10 స్థానాలలో, ఉచ్చ స్వక్షేత్రాలలో ఉన్నప్పుడు భద్ర మహాపురుష యోగం ఏర్పడుతుంది.

మిధున రాశి
మిధున రాశికి అధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల భద్ర మహాపురుష యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మిధున రాశి జాతకులు తమ సామర్థ్యాలను, ప్రతిభను ప్రదర్శించే లబ్ధిని పొందుతారు. ఉద్యోగస్తులు ఉన్నత స్థానాలకు వెళతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఈ సమయంలో విద్యార్థులు చదువులో రాణిస్తారు. గృహ, వాహన యోగాలు ఉన్నాయి. ఆస్తి, వివాదాలు పరిష్కారం అవుతాయి.
సింహరాశి
భద్ర మహాపురుష రాజయోగం వల్ల సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. వర్తక వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి భౌతిక సుఖాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా విజయం వరిస్తుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు.
కన్యారాశి
ఈ రాశిలో రాశి అధిపతి అయిన బుధుడు ఉచ్చ స్థితిలో ఉండడం వలన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో కన్యా రాశి వారి సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది . ఉద్యోగాలు చేసే వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సామాజికంగా గుర్తింపును పొందుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి లాభ స్థానంలో బుధుడు ఉచ్చ స్థితిలో ఉండబోతున్న కారణంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వీరి వృత్తి జీవితం అంచనాలకు మించి పురోగతి చెందుతుంది. వర్ధక వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆస్తి వివాదాలు కోర్టు కేసులు సానుకూలంగానే పరిష్కారం అవుతాయి. ఇది వృశ్చిక రాశి వారికి అదృష్ట సమయం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ రాశిలో దశమ స్థానంలో బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్న కారణంగా లబ్ధి జరుగుతుంది. ధనుస్సు రాశి జాతకులు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు..
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications