భద్ర మహాపురుష రాజయోగం.. ఈ రాశులవారికి కింగ్ సైజ్ లైఫ్!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో బుధుడు వృషభరాశి నుంచి మిధున రాశికి రవాణా అవుతాడు. మిధున రాశిలో బుధ సంచారం కారణంగా భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ప్రభావం ద్వాదశ రాశులవారిపై ఉంటుంది. బుధుడు తన స్వంత రాశిలో కానీ, ఉన్నతమైన రాశిలో కానీ, లేదా మూల త్రికోణంలో వ్యక్తి యొక్క జాతకంలో మధ్యలో ఉన్న సమయంలో, అది భద్ర మహాపురుష రాజయోగాన్ని ఏర్పరుస్తుంది.
భద్ర మహాపురుష రాజయోగం త్వరలో
జూన్ 14వ తేదీ రాత్రి 10 గంటల 55 నిమిషాలకు బుధుడు మిధున రాశిలోకి వెళతాడు. ఇక ఈ బుధసంచారం వల్ల భద్ర రాజయోగం ఏర్పడగా, భద్ర మహాపురుష రాజయోగం కొన్ని రాశుల వారికి కింగ్ సైజ్ లైఫ్ ఇస్తుంది. కొన్ని రాశులవారికి సంపద వర్షాన్ని కురిపిస్తుంది. ఈ సమయంలో వీరు గణనీయమైన ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు.

వృషభ రాశి
భద్ర రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. వృషభ జాతకులు ఈ సమయంలో ఏ పని అనుకున్నా ఆ పనులలో విజయాన్ని సాధిస్తారు. భద్ర యోగం కారణంగా వృత్తి, వ్యాపారాలలో గణనీయమైన ఆర్థిక లబ్ధిని పొందుతారు. ఉద్యోగాలు చేసుకునే వారికి పనిచేసేచోట మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కుటుంబంతో వీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
మిధున రాశి
భద్ర మహాపురుష రాజయోగం కారణంగా మిధున రాశి వారికి అన్ని విధాలుగా కలిసివస్తుంది. ఈ సమయంలో వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి. మిథున రాశి జాతకులు ఈ సమయంలో కెరీర్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయం. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ సమయంలో జీవితంలోని కోరికలన్నీ నెరవేరుతాయి. వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.
కన్యా రాశి
భద్ర మహాపురుష రాజయోగంతో కన్యా రాశి జాతకులకు ఆర్దికంగా ప్రయోజనం కలుగుతుంది. వీరి అదృష్టం ప్రకాశిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఈ సమయంలో ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లు ఆశించే వారు ఈ సమయంలో శుభావార్తలు వింటారు.
సింహరాశి
భద్ర మహాపురుష రాజయోగం కారణంగా జూన్ నెలలో సింహరాశి వారికి అన్ని విషయాలలోనూ లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్ లను పొందుతారు. ఉన్నతాధికారులతో మెప్పు పొందుతారు. ఇక సింహరాశి వారికి విదేశాలలో డబ్బు సంపాదించడానికి ఇది సువర్ణవకాశం. ఈ సమయంలో ఏ పని చేసినా విజయవంతమవుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఉత్సాహంగాను, ఆరోగ్యంగానూ ఉంటారు.
మకర రాశి
భద్ర మహాపురుష రాజయోగం కారణంగా జూన్ నెలలో మకర రాశి జాతకులను అదృష్టం వరిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. మకర రాశి జాతకులు ఈ సమయంలో డబ్బుకు లోటు లేకుండా ఉంటారు. ఈ సమయంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విదేశాలలో నివసించే వారికి బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో జీతం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
ధనుస్సు రాశి
భద్ర మహాపురుష రాజ యోగం కారణంగా ధనస్సు రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. మీరు ఆహ్లాదకరమైన వాతావరణం అనుభవిస్తారు. వృత్తిలో రాణిస్తారు. వర్తక, వ్యాపారాలలో గణనీయమైన ఆర్థిక పురోగతిని ధనుస్సు రాశి వారు సాధిస్తారు. ధనుస్సు రాశి జాతకులకు అన్నింటా లబ్ది జరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications