త్వరలో ఈ రాశుల ఇంట సంపదల పంట పండిస్తానన్న భాస్కరయోగం!

వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేసే సమయంలో వివిధ యోగాలను ఏర్పరుస్తాయి అనే విషయం తెలిసిందే. జూన్ నెలలో జ్యోతిషశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. అటువంటి యోగాలలో భాస్కర యోగం ఒకటి. జ్యోతిష్యంలో బుధుడు, సూర్యుడు, చంద్రుడు, మరియు బృహస్పతి యొక్క ప్రత్యేకమైన స్థానాల ద్వారా ఈ భాస్కర యోగం ఏర్పడుతుంది.

జూన్ లో భాస్కర యోగం
జూన్ మొదటి వారంలో బుధుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు . బుధుడు సూర్యుని యొక్క రెండవ ఇంట్లో ఉంటాడు. బుధుడికి సంబంధించిన 11వ ఇంట్లో చంద్రుడు, చంద్రుడి నుంచి త్రయంలో బృహస్పతి ఉండడంవల్ల భాస్కర యోగం ఏర్పడుతుంది. ఈ భాస్కరయోగం ఉన్న వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండి సంతోషంగా జీవిస్తారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

bhaskara yoga gives huge wealth and happy life to these zodiac signs

వృషభ రాశి
వృషభ రాశి వారికి భాస్కర యోగం కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. భాస్కర యోగం కారణంగా వీరికి కృషికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల మన్ననలు లభిస్తాయి. సమాజంలో అరుదైన గుర్తింపు లభిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఏ ప్రయత్నం చేసిన ఈ సమయంలో సక్సెస్ అవుతారు.

సింహరాశి
జూన్ మొదటివారంలో ఏర్పడే భాస్కరయోగం కారణంగా సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సింహరాశి వారు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. చాలాకాలంగా భూములు, ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారి కోరికలు ఈ సమయంలో తీరుతాయి. జూన్ మొదటివారం వీరికి చాలా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి అదృష్టం కలిసివస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

తులారాశి
తులారాశి జాతకులకు జూన్ మొదటి వారం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరి జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది. తులారాశి జాతకులకు కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. అదనపు ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+