శనిదేవుడు మోసుకొస్తున్న లక్ష్మీ యోగం..ఈ రాశుల వారి జతకాలు మారిపోయినట్టే..!
భారతీయ జ్యోతిషశాస్త్రంలో శనిని ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. దీనిని కర్మ కారకుడిగా , న్యాయానికి అధిపతిగా భావిస్తారు. శని వ్యక్తి యొక్క కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు అని నమ్ముతారు.శని అనుగ్రహం ఉంటే, వ్యక్తికి కష్టపడే తత్వం, నిబద్ధత, మరియు ఓర్పు వంటి లక్షణాలు లభిస్తాయి. వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మరియు సమాజంలో గౌరవం పొందుతారు.శని దోషం ఉంటే, వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, మరియు ఉద్యోగంలో ఒత్తిడి వంటివి కలుగుతాయి. శనిదేవుని అనుగ్రహం ప్రధానంగా కొన్ని రాశుల వారి మీద చూపించనుంది.ఆ రాశులను ఓసారి పరిశీలిస్తే...
శని దేవుడికి అత్యంత ఇష్టమైన రాశులలో కుంభ రాశి కూడా ఒకటి. కుంభ రాశి వారికి శనిదేవుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటారు. ఈ రాశి వారు సాధారణంగా యాక్టివ్‌గా ఉంటారు. సమాజంలో మంచి పేరు గౌరవం పొందుతారు. పని ప్రదేశంలో ప్రశంసలు అందుతారు.

శనికి అత్యంత ఇష్టమైన మరో రాశి తులా రాశి కూడా ఒకటి. తులా రాశి వారికి శనిదేవుని అనుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది.వీరి జీవితం సంతోషంగా.. ఆనందంగా కొనసాగుతుంది. వీరు నాయకత్వ లక్షణాలతో ఉంటారు.శని దేవుడు ఈ రాశుల వారిని నిత్యం రక్షిస్తూ ఉంటాడు.
వృషభ రాశి వారిపై కూడా ఆ శనిదేవుని కృప ఉంటుంది.దీని వల్ల వీలు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు.ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ కూడా వెంటనే జరిగిపోతాయి. శనిదేవుని దయతో త్వరగా జీవితంలో సెటిల్ అవుతారు ఏ వ్యాపారాలు ప్రారంభించిన దూసుకుపోతారు.












Click it and Unblock the Notifications