ఇంటికి ఇవి తెచ్చుకోండి.. అదృష్టం నడిచివస్తుంది
నూతన సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరపుకున్నప్పటికీ మన సాంప్రదాయం ప్రకారం అసలైన నూతన సంవత్సరం ఉగాదిరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడంవల్ల అదృష్టం నడిచివస్తుందని పండితులు చెబుతుంటారు. అదృష్టాన్ని తెచ్చే వస్తువుల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం.
చిన్న కొబ్బరి
వాస్తును అనుసరించి ఎండు కొబ్బరి కానీ, పచ్చికొబ్బరి లేదా కొబ్బరి బోండాం ఏదైనా సరే లక్ష్మీ ప్రతీక. అందుకే పూజల్లో కొబ్బరి కాయకు ప్రత్యేకస్థానం. కొబ్బరి కాయ కొట్టకుండా పూజ పూర్తికాదు. చిన్న ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని పూజలో ఉంచి తర్వాత దాన్ని డబ్బు దాచే చోట పెట్టుకోవచ్చు. దీనివల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

తులసి మొక్క
తులసి మొక్క పవిత్రమైంది మాత్రమే కాదు, ఔషద మొక్క కూడా. తులసి ఉన్న ఇల్లు సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగుతుందని ప్రతీతి. ఎవరి ఇంట్లో తులసి మొక్క ఉంటుందో ఆ ఇల్లు తీర్థ స్వరూపం అని శాస్త్రం చెబుతోంది. తులసిని వాకిట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవినిని ఆహ్వానించినట్లే.
తాబేలు ప్రతిమ
సుఖశాంతులకు ప్రతీక అని వాస్తు శాస్త్రం చెబుతోంది. లోహపు తాబేలును ఇంట్లోకి తెచ్చుకుంటే మహాలక్ష్మి నడిచొస్తుందని నమ్మకం. తాబేలు ప్రతిమ వల్ల
ఆలస్యమైన పనులు కూడా వేగంగా పూర్తవుతాయట. ఇత్తడి, వెండి, గాజు తాబేలును ఇంటికి తెచ్చుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
ముత్యపు చిప్ప
సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ముత్యాలు కూడా సముద్ర గర్భం నుంచి పుట్టాయి కాబట్టి ముత్యపు చిప్పలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవని ప్రతీతి. ముత్యపు చిప్ప ఉన్న ఇంట్లో డబ్బులకు లోటుండదట. ముందు పూజలో ఉంచి తర్వాత దాన్ని డబ్బుదాచే చోట పెట్టాలని సలహా ఇస్తున్నారు.
నెమలి ఈకలు
నెమలి ఈకలు శ్రీకృష్ణుని కి చాలా ఇష్టం. ఆయన నెమలి పించాన్ని తలమీద ధరించేవాడు. నెమలి పింఛం ఉన్నచోట లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకు కూర్చుంటుందని పండితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications