బుధ గోచారం: నేటి నుండి ఈ రాశులవారికి వ్యాపారాలలో నష్టాలు.. జాగ్రత్త!!
జూన్ 14వ తేదీ రాత్రి బుధుడు 10:55 నిమిషాలకు మిధున రాశిలోకి సంచరిస్తున్నాడు. బుధుడు మిధున రాశిలో ప్రవేశించడం వర్తక వ్యాపారాలు చేసుకునే వారికి సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు వ్యాపార విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
బుధ గ్రహ సంచారం వల్ల మేష రాశి వారి వ్యాపారం క్షీణించే అవకాశం ఉంది. మేషరాశి జాతకులు వివిధ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంతోపాటు, వర్ధక వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. వ్యాపారాలలో కఠినమైన పోటీని కూడా మేష రాశి జాతకులు ఈ సమయంలో ఎదుర్కొంటారు.

వృశ్చిక రాశి
బుధ గ్రహ గోచరం వలన వృశ్చిక రాశి జాతకులకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వారి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మీరు చూసేవారికి స్వార్థపరులుగా కనిపిస్తారు. పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు ఏం చేసినా కూడా లాభాలు పొందలేరు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి,
మకర రాశి
బుధ గ్రహ గోచారం కారణంగా మకర రాశి జాతకులకు ఖర్చులు బాగా పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకోవడంలో మకర రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులు గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఈ సమయంలో అప్పులు చేసే అవకాశం ఉంది. బుధ గ్రహ గోచారం మకర రాశి వారికి ప్రమాదకరమైన పరిస్థితులను తెచ్చిపెడుతుంది.
కుంభరాశి
బుధ గ్రహ సంచారం కారణంగా కుంభరాశి జాతకుల పురోగతిలో మార్పు ఉంటుంది. స్థానికుల వ్యాపారాలలో హెచ్చుతగ్గులు వస్తాయి. ఎంత కష్టపడినా ఆశించిన మేరకు ఫలితం రాదు. స్వల్ప లాభాలతోనే సంతృప్తి చెందాల్సి వస్తుంది. పోటీదారుల నుండి కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మీనరాశి
బుధ గ్రహ సంచారం కారణంగా మీనరాశి జాతకులు బిజినెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి జాతకులు తమ ఉద్యోగం గురించి ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది. ప్రత్యర్థులు ఇబ్బందులను సృష్టించే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యాపారం చేస్తే కొంతమేర లాభాలు పొందవచ్చు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications