తిరోగమనంలో బుధుడు.. ఈ రాశుల వారికి అదృష్టం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం కొంత కాలం తర్వాత రాశిచక్రాలను మారుస్తుంది. ఈ ప్రభావం అన్ని రాశులకు సంబంధించినవారిపై ఉంటుంది. గ్రహాలకు రాకుమారుడులాంటి బుధుడు ఈనెల 23వ తేదీన మేషరాశిలో తిరోగమించనున్నాడు. దీనివల్ల వ్యాపారం, ఉద్యోగంతోపాటు ఆరోగ్య స్వభావాలన్నింటిలో ప్రభావం ఉంటుంది. బుధుడు మేషరాశిలో అస్తమించడంవల్ల అనేక రాశులవారికి ప్రయోజనం కలగబోతోంది. ఆ రాశులు ఏవేంటో తెలుసుకుందాం.
కన్యా రాశి
కన్య రాశిలో బుధుడు 8వ తిరోగమించనున్నాడు. దీనివల్ల అదృష్టం మద్దతు లభిస్తుంది. డబ్బులు పొదుపు చేయడంతోపాటు పెట్టిన పెట్టుబడి లోను విజయం లభిస్తుంది. కెరీర్ లో మంచి ఆఫర్లు ఈ సమయంలోనే వస్తాయి. కొత్త ఆదాయ వనరులు లభ్యమవుతాయి.

తుల రాశి
7వ ఇంట్లో బుధుడు అస్తమించబోతున్నాడు. 9, 12వ ఇంటికి అధిపతిగా బుధుడిని పరిగణిస్తారు. ఈ కారణంవల్లే ఈ రాశి వారికి బుధుని అస్తమయం కలగబోతోంది. వాహనాన్ని లేదంటే ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కోరికలన్నీ నెరవేరతాయి.
కుంభ రాశి
5, 8వ గృహాలకు బుధుడు అధిపతి. కుంభం 3వ ఇంటిలో అస్తమించబోతున్నాడు. ధైర్యానికి, విశ్వాసానికి చిహ్నంగా పరిగణిస్తారు. విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications