బుధాదిత్య రాజయోగంతో వీరికి డబ్బుల మూటలను అందిస్తున్న బుధ, సూర్యులు!
గ్రహాల రాకుమారుడైన బుధుడు తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. నిన్నటి వరకు అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు నేడు తులా రాశిలో ఉదయిస్తున్నాడు. ఇక బుధుడు అక్టోబర్ 29న వృశ్చిక రాశిలోకి సంచరించబోతున్నాడు. ఇక అదే విధంగా అక్టోబర్ 17వ తేదీన ఇప్పటికే తులా రాశిలో సూర్య సంచారం కొనసాగుతుంది. నవంబర్ 16వ తేదీ వరకు సూర్యుడు తులారాశిలోనే సంచరిస్తాడు.
బుధాదిత్య రాజయోగం
ఈలోపు తులా రాశిలో బుధుడు సూర్యుడు కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం రెండు గ్రహాలూ తులారాశిలో ఉండటం వలన ఏర్పడుతున్న ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి ముఖ్యంగా ఆర్థిక లాభాలను, శ్రేయస్సును కలిగిస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
బుధాదిత్య రాజయోగం కారణంగా మేష రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాల కలిసొస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కారమై ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగాలు చేసేవారికి కొత్త ప్రాజెక్టులు వస్తాయి. వ్యాపారాలు చేసేవారికి కూడా కలిసి వస్తుంది .వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మతపరమైన అంశాలపై ఫోకస్ చేస్తారు.
మిధున రాశి
బుధాదిత్య రాజయోగం కారణంగా మిధున రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. వీరికి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో మిధున రాశి వారు శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి సమయం. ఈ సమయంలో మిధున రాశి జాతకులు ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు.
వృశ్చిక రాశి
బుధాదిత్య రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయం వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేసి విహారయాత్రలకు కూడా వెళతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో లాభదాయకంగా ఉంటుంది. పనిచేసే చోట సీనియర్ల మద్దతు దొరుకుతుంది. కొత్త పనులను నేర్చుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇది వృశ్చికరాశి వారికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications