త్వరలో విశేష రాజయోగంతో ఈరాశులవారి నట్టింట సిరులపంట!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాకుమారుడుగా బుధుడిని పిలుస్తారు. తెలివికి, తర్కానికి, వ్యాపారానికి కారణంగా పరిగణించబడే బుధుడు సంచారం చేయడం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక మకర రాశిలో బుధుడు జనవరి 24వ తేదీ ఉదయం 11 గంటల 55 నిమిషాలకు ప్రవేశిస్తాడు.
బుధాదిత్య రాజయోగం
బుధుడు మకర రాశిలో సంచరించడం వల్ల అప్పటికే మకర రాశిలో ఉన్న సూర్యుడుతో సంయోగం జరిగి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ బుధాదిత్య రాజయోగం ప్రభావం ఫిబ్రవరి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తోంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
మకర రాశిలో బుధాదిత్య రాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా విజయం వరిస్తుంది . వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. వ్యక్తిగత జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఆర్థిక లాభాలతో ధనుస్సు రాశివారు సంపన్నులు అవుతారు.
మకర రాశి
మకర రాశిలో బుధాదిత్య రాజయోగం కారణంగా మకర రాశి వారికి అన్నింటా మంచి ఫలితాలే వస్తాయి. మకరరాశి జాతకులు ఆర్ధిక పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి మద్దతు ఈ సమయంలో బాగా లభిస్తుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
తులారాశి
తులా రాశి వారికి బుధాదిత్య రాజయోగం అదృష్టాన్ని తీసుకు వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి. తులారాశి జాతకుల నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి. పెట్టుబడికి మంచి రాబడికి ఇది మంచి సమయం.
కుంభరాశి
కుంభరాశి వారికి బుధాదిత్య రాజయోగం చాలా మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆర్థిక విషయాలలోనూ, వృత్తి అవకాశాలలోనూ వృద్ధిని అనుభవిస్తారు. ఈ సమయంలో వీరు వీరిలో ఉన్న కొత్త ఆలోచనలు ప్రదర్శించడానికి బాగుంటుంది. బుధాదిత్య రాజయోగం కుంభరాశి జాతకులకు మంచి అవకాశాలను ఇస్తుంది. ఇది వీరికి అన్ని విధాలుగా సానుకూల ఫలితాలను ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications