బృహస్పతి దయతో డిసెంబరు 5 నుంచి ఈ రాశులకు ప్రతిరోజు పండగే!
జ్యోతిష్యం ప్రకారం దేవతల గురువైన బృహస్పతి జ్ఞానాన్ని ప్రసాదించడంతోపాటు వివాహాన్ని, సంతానాన్ని ఇస్తాడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడతాడు. అటువంటి గురువు ఈ నెల 11వ తేదీన కర్కాటక రాశిలోకి తిరోగమనం చేసింది. తిరిగి వచ్చే నెల 5వ తేదీన మిథునరాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ 5 రాశులకు మాత్రం అత్యధిక ప్రయోజనాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
మేష రాశి
ఉద్యోగస్థులకు చాలా లాభాలున్నాయి. అనారోగ్యంతో బాధపడేవారికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. పాత సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. అలాగే అద్భుతమైన విజయాలను కూడా ఈ రాశివారు సాధించబోతున్నారు.

మీన రాశి
ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. మానసికంగా చాలా ప్రశాంతంగా జీవిస్తారు. పిల్లల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలను అందుకుంటారు. పెల్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. సమస్యలకు ఈ సమయంలోనే పరిష్కారం లభిస్తుంది.
కర్కాటక రాశి
అదృష్టం కలిసివస్తుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు అందుకుంటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. విజయాలను సొంతం చేసుకుంటారు. గతంలోకంటే ఇప్పుడు డబ్బు పరంగా బలపడతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు చాలా బాగుంటుంది.
మిథున రాశి
క్లిష్టమైన వ్యాపారాలు చేస్తున్నవారికి చాలా బాగుంటుంది. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. కొత్తగా ఆదాయ వనరులు కూడా దొరుకుతాయి. అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. జీవితంలో సానుకూల పరిణామాలే ఎదురవుతాయి.
ధనుస్సు రాశి
కంటున్న కలలను నెరవేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఒకరకంగా ఈ రాశివారికి ఇది స్వర్ణయుగం. ఆధ్యాత్మికంగా కూడా జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్థులు కొత్త బాధ్యతలు స్వీకరించి, కొత్తగా గౌరవాన్ని అందుకుంటారు. ఈ సమయం వీరికి బాగా కలిసివచ్చే సమయం.












Click it and Unblock the Notifications