ఆగస్ట్ లో ఈ రాశులవారికి డబ్బు సంచులను మోసుకొస్తున్న నాలుగు గ్రహాలు
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావం ఉంటుందన్న విషయం మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటున్నాం . గ్రహాల సంచారం కారణంగాను, గ్రహాల సంయోగం కారణంగాను అనేక రాజయోగాలు ఏర్పడతాయి. కొన్ని రాజయోగాలు శుభ యోగాలు కాక మరికొన్ని అశుభ యోగాలు.
సింహరాశిలో చతుర్గ్రాహి యోగం
ఇక ఆగస్టు నెలలో సూర్యుడు బుధుడు, సింహరాశిలోకి ప్రవేశించిన తర్వాత శుక్రుడు చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తారు. దీంతో ఆగస్టు నెలలో ఈ నాలుగు గ్రహాల సంయోగం కారణంగా సింహరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. చతుర్గ్రాహి యోగం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారు లబ్ధిని పొందుతారు. వీరికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది.

సింహరాశి
సింహరాశి వారి లగ్న గృహంలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా సింహ రాశి వారికి గణనీయమైన ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఉద్యోగాలు మారడానికి శుభ సమయం. సింహరాశి జాతకులు ఈ సమయంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ సమయంలో సింహ రాశి వారికి పదోన్నతులు లభిస్తాయి. ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. వివాహితులు సంతోషంగా జీవిస్తారు. పెళ్ళికాని వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో తొమ్మిదవ ఇంట్లో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు అన్ని విధాలుగా లబ్ధిని పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఈ సమయంలో విదేశీ ప్రయాణాల సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ధనుస్సు రాశి జాతకుల ఇళ్లల్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయం ధనస్సు రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి జాతకంలో కర్మ గృహంలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అన్ని పనులలోను విజయం చేకూరుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. డబ్బు సంపాదించడంతో పాటు పొదుపు కూడా చేస్తారు. ఉద్యోగస్తులు ఈ సమయంలో పదోన్నతులు పొందుతారు. నూతన ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఉద్యోగాలు లభిస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications