2026 జనవరిలో చతుర్గ్రాహి యోగంతో వీరింట కాసుల పంట ఖాయం!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడతాయి. జనవరి 2026 లో సూర్యుడు జనవరి 14వ తేదీన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాల అధిపతి అయిన కుజుడు మకర రాశిలో సంచరిస్తాడు. 17న మకర రాశిలోకి బుధుడు కూడా ప్రవేశిస్తాడు.
జనవరిలో చతుర్గ్రాహి యోగం
సంపదను ఇచ్చే శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. నాలుగు గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించడం కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది ఈ చతుర్గ్రాహి యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. సానుకూల ఫలితాలను కలుగజేస్తుంది. మరి చతుర్గ్రాహి యోగంతో లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి జాతకులకు చతుర్గ్రాహి యోగం శుభాలను చేకూరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు పనిలోను, వ్యాపారంలోనూ పురోగతిని చూస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు వస్తాయి. వెంచర్లను ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. పదోన్నతుల గురించి శుభవార్తలు వింటారు. ఇది మేష రాశి వారికి సంతోష సమయం.
తులారాశి
తులారాశి జాతకులకు చతుర్గ్రాహి యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సంచారం మీ రాశిలో నాలుగవ ఇంట్లో జరుగుతుంది. దీనివల్ల తులారాశి జాతకులు భౌతిక సుఖాలను పొందుతారు. వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. పదోన్నతులు లభిస్తాయి. జీతం పెరుగుతుంది. పనిలో కొత్త బాధ్యతలకు అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి ఒప్పందాలు వస్తాయి. పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి.. అత్తమామలతో సంబంధం బాగుంటుంది.
మకర రాశి
చతుర్గ్రాహి యోగం మకర రాశి జాతకులకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడడం వల్ల గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. స్నేహితులతోనూ సంతోషంగా ఉంటారు. మీ వ్యక్తిత్వం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. కొత్త భాగస్వామ్య వ్యాపారాలకు అవకాశం ఉంది. వివాహితులు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. పెళ్ళికాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
today rashiphalau: ఉగాదికి ముందు సూర్య, శని,రాహువుల దయతో వీరికి పట్టిందల్లా బంగారం! -
వాస్తు ప్రకారం మీరున్న ఇంటిని బావిని పూడ్చి కట్టారని తెలిస్తే? -
ఏప్రిల్ నెలలో మిథున రాశి, కర్కాటక రాశి జాతక ఫలం -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications