శ్రీరామనవమికి ఇంట్లో ఈ ఐదు ప్రదేశాలు శుభ్రం చేస్తేనే లక్ష్మీకటాక్షం!

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందూమతంలో అత్యంత గొప్ప ప్రాముఖ్యతను కలిగిన శ్రీరామనవమి పండుగను వాడ వాడలా ఎంతో ఘనంగా జరుపుతారు. సీతారాముల కల్యాణ వైభవాన్ని ప్రతి ఒక్కరు తిలకించి తరిస్తారు. లోక కళ్యాణం కోసం జరిపే సీతారామ కళ్యాణాన్ని నిర్వహించడం కోసం ఇప్పటికే అందరూ సన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఇళ్లల్లో కూడా శ్రీరామనవమి సందర్భంగా జగదభిరాముడు అయిన శ్రీరామచంద్రమూర్తిని పూజిస్తూ వేడుకలు జరుపుకుంటారు.

శ్రీరామనవమి పండుగకు శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఐదు ప్రదేశాలు
అయితే శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఏం చేయాలి? ఏ విధంగా పూజించాలి? ఎటువంటి నియమాలను పాటించాలి? వంటి వివరాలను తెలుసుకుందాం. శ్రీరామనవమి పండుగ రోజు ఇంట్లోని ఐదు ప్రదేశాలను కచ్చితంగా శుభ్రం చేయాలి. ఇంట్లో ఉండే ఈ ఐదు ప్రదేశాలు కచ్చితంగా శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి కటాక్షం కలగదు. మరి ఆ ప్రదేశాలేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Clean these five places for Sri Ram Navami Puja you will be blessed with wealth

పూజా మందిరం
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న పూజా మందిరం సానుకూల శక్తికి మూలంగా చెప్పబడుతుంది. శ్రీరామనవమి పండుగకు ముందే పూజా మందిరాన్ని శుభ్రం చేసి విరిగిపోయిన విగ్రహాలను, పగిలిపోయిన ఫోటోలను పూజ మందిరం నుంచి తొలగించాలి. పూజకు సంబంధించిన కావలసిన వస్తు సామాగ్రిని మాత్రమే ఉంచుకొని, ఇతర పనికిరాని వస్తువులను పూజ మందిరం నుంచి తీసివేయాలి. ఎవరైతే పూజా మందిరాన్ని అశుభ్రంగా ఉంచుతారో వారు పేదరికం అనుభవించాల్సి వస్తుంది.

వంటగది
లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి కొలువై ఉండే ప్రదేశంగా వంటగదిని చెబుతారు. అటువంటి వంటగది శ్రీరామనవమికి ముందే శుభ్రం చేసుకోవాలి. వంటగదిలో కూడా పనికిరాని వస్తువులను ఉంచుకోకూడదు. పాత్రలు కడగకుండా పెట్టుకోకూడదు. పాడైపోయిన పదార్థాలు, పచ్చళ్ళు పడేయాలి. లేదంటే రాహు కేతువుల ప్రభావం పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఉత్తర దిశ.. ఈశాన్యం మూల
వాస్తు నియమాల ప్రకారం శ్రీరామనవమి పండుగ రోజు పూజ చేసుకునే వారు ఇంటికి ఉత్తర దిశను, ఈశాన్యం మూలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఈ దిశలు శుభ్రంగా ఉంటే దేవుళ్ళ యొక్క కటాక్షం ఉంటుందని చెబుతున్నారు. ఏ ఇంట్లో అయితే ఈ దిశలలో పరిశుభ్రత ఉండదో అక్కడ లక్ష్మీదేవి నివసించదని చెబుతున్నారు.

ప్రధాన ద్వారం
ఎవరైతే శ్రీరామనవమి రోజు శ్రీరాముని పూజిస్తారో వారు ఇంటి ప్రధాన ద్వారం ముందు మురికి లేకుండా చూసుకోవాలి. ఇంటి ప్రవేశ ద్వారం చక్కగా అందంగా అలంకరించుకోవాలి. సానుకూల శక్తి అయిన ప్రతికూల శక్తి అయిన ఇంటి ప్రవేశ ద్వారం గుండానే ఇంట్లోకి వస్తుంది కాబట్టి అక్కడ ఏ విధమైన చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. చెప్పులు ఇంటి ప్రధాన ద్వారం ముందు వదలకూడదు. ఒకవేళ ఇటువంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా పోతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు శ్రీరామనవమి పండుగ రోజు ఈ ప్రదేశాలను కచ్చితంగా శుభ్రంగా ఉంచుకోండి. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని వన్ ఇండియా తెలుగు ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+