వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమ్మకం నడిపిస్తుంది, విశ్వాసం కాపాడి నిలబెడుతుంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

మనం ఎవరిని ఎంత వరకు నమ్ముతున్నామో మనకే సరియైన అవగాహణ లేకుండా వ్యవహరిస్తుంటాము. అనవసరమైన అనుమానాలతో మంచి బంధాలను పాడు చేసుకుంటాము. అతిగా ఆలోచించే మనతత్వం కలిగినవారు రేపటి గురించి ఆలోచించి ఈ రోజును పాడు చేసుకుంటారు. ప్రతి వ్యక్తి ప్రస్తుత కాలన్ని సద్వినియోగ పరచుకోవాలి. ఈ భావంతో వ్యవహరించుకోగలిగితే ప్రతి రోజు ఒక ఆనందమైన రోజుగా గడుస్తుంది. అందుకు ఉదహరణగా భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క మనస్తత్వాన్ని ఎలా పరీక్షించాడో చూడండి.

Confidence and Faith are important in our life

ఒకనాడు శ్రీ కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ఉద్యానవనంలో కూర్చోని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అపుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశంవైపు చూపి
'ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా ' అని అడిగాడు.

అర్జునుడు " అవును కృష్ణా! అది పావురమే " అన్నాడు.

మరికాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు.

" అబ్బే! అది పావురం కాదు గ్రద్దలా ఉంది చూడు చూడు.
"అవును నిజమే అది పావురం కాదు అది గ్రద్దనే కృష్ణా" అన్నాడు అర్జునుడు.

కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడు.."అర్జునా! అది గ్రద్ధ కానే కాదు. అది చిలుక సరిగ్గా చూడు ఒక్కసారి"
"నిజమే కృష్ణా! అది చిలుకనే" అన్నాడు అర్జునుడు.

చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు

కృష్ణుడు... "అయ్యో! అది చిలుక కూడా కానేకాదు. అది కాకి అర్జునా!
ఒక్కసారి పరీక్షించి చూడు"

"
అరే! నిజమే అది చిలుక కాదు కాకే కృష్ణా!" అన్నాడు అర్జునుడు.

కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు.

" అసలు నీకు బుద్ధి ఉందా? నీకంటూ ఒక అభిప్రాయం లేదా?
సొంతంగా ఆలోచించలేవా? నేను ఏదంటే అదే అని వంత
పాడుతున్నావు " అన్నాడు.

దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు.

" ఓ సర్వాంతర్యామీ! నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను.
నువ్వు ఏదంటే నేనూ అదే! మీరు పావురమే కదా అన్నారు
. నేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది.
నాకు అన్నీ మీరే. మీ మాటే నాకు వేదం కృష్ణా!"

నమ్మకమే భగవంతుడే అర్జునుడి ప్రక్కన ఉండేలా చేసింది.

దేవుడిపైన మనకు అనుమానం అక్కరలేదు. భగవంతునిపైన నిజమైన నమ్మకాన్ని
ఉంచాలి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే
శక్తి ఆ పరమాత్మునికి ఉంది. మనకు కావలసింది ఏదో ఆ దేవునికి
తెలుసు. ఎప్పుడు మనకు ఏది ఇవ్వాలో మన నుండి ఎప్పుడు ఏది తీసుకోవాలో
అన్నీ ఆ దేవుడికి తెలుసు. భగవంతుడికి శరణుజొచ్చి నమ్మకంతో జీవించిన వారికి అన్ని తానై నడిపిస్తాడు.

మనం ఎవరినైనా నమ్మితే పూర్తి విశ్వాసంగా నమ్మలి. కొంత అనుమానం, సందేహాలు అనేవి ప్రారంభ దశలోనే నిర్ణయించుకోవాలి. ఒకసారి నమ్మకం కుదిరాక తిరిగి పరిపరి విధాలుగా ఆలోచనలు రాకూడదు. అది ఏ బంధమైన సరే విశ్వాసం, నమ్మకం ఉంటే ఆ మైత్రితో మంచి మేలును కలుగజేస్తుంది. పరిపూర్ణమైన నమ్మకంలో నారాయణుడు ఉంటాడు.

English summary
Confidence and Faith are important in our life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X