ఏప్రిల్ 8 రాశిఫలాలు.. ఆర్థికంగా విజయం ఉంది
సోమవారం
అమావాస్య తిథి
ఉత్తరాభాద్ర నక్షత్రం
ఫాల్గుణ మాసం
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
మేష రాశి
ప్రమోషన్ లభిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శివపంచాక్షరీ మంత్రంతో శివుణ్ని పూజించడంతోపాటు అభిషేకం చేస్తే మంచిది.

వృషభ రాశి
వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త వ్యాపారాల్లో విజయం ఉంది. విద్యార్థులు కష్టపడాలి. అనుకున్న పనులు పూర్తవుతాయి. మంచి ఫలితాలు సాధించేందుకు చంద్రశేఖర అష్టకం పఠించాలి. శివాలయాన్ని దర్శించండి
మిథున రాశి
సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాలున్నాయి. ఆర్థికంగా పురోగతి ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మరింత మంచి ఫలితాల కోసం శివాలయంలో కృష్ణ, గోదావరి, గంగ, కావేరీ జలాలతో అభిషేకం చేయడం మంచిది.
కర్కాటక రాశి
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్లలో లాభాలున్నాయి. ఒత్తిడికి లోనవుతారు. వ్యాపార అభివృద్ధితోపాటు ఉన్నత పదవులు అందుకుంటారు. విదేశీ ప్రయత్నం కలిసివస్తుంది. ఆరోగ్యంగా సమస్యలున్నాయి. బిల్వపత్రాలతో శివుణ్ని పూజించడంతోపాటు బిల్వాష్టకం పఠించండి.
సింహ రాశి
కీర్తి కలుగుతుంది. శుభవార్తను వినడంతోపాటు పనితీరుపై ప్రశంసలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. అనుకోకుండా కోరుకున్నవి వస్తాయి. సూర్యనారాయణమూర్తికి తర్పణాలు వదిలి లింగాష్టకాన్ని పఠించాలి.
కన్యా రాశి
మొహమాటంవల్ల ఇబ్బందులున్నాయి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. వృథాగా ప్రయాణాలు చేస్తారు. సమయానికి నిద్రపోవాలి. మంచి ఫలితాల కోసం పంచామృతాలతో శివుడికి అభిషేకం చేసుకోవడంతోపాటు శివపురాణం పఠించాలి.












Click it and Unblock the Notifications