డిసెంబరులో ఈ రాశులకు రాజయోగం ప్రకటించిన నవగ్రహాలు
నవగ్రహాలు ఖగోళంలో నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులవారికి సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే కొన్ని రాజయోగాలను కూడా గ్రహాలు ఏర్పరుస్తుంటాయి. ఏడాది చివరి నెల అయిన డిసెంబరులో ఒక్కో రాశి ఒక్కోవిధంగా ఉంటుంది. ఏయే రాశులవారికి డిసెంబరు నెలలో రాజయోగాలు కలుగుతున్నాయి? ఏవిధంగా కలిసివస్తున్నాయి? అనే విషయాలను తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఈనెలలో వీరిని ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే వీటి నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. డిసెంబరు నెల వీరికి బాగా కలిసివస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఏ పని తలపెట్టినా ఇద్దరూ ఒకమాట మీద ఉండి దాన్ని విజయవంతం చేస్తారు.

మిథున రాశి
ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఈ రాశివారు ఎంతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. పనిచేసేచోట ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈనెలలో కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి మంచి ప్రణాళికలను ఆలోచించుకోవాలి.
మేష రాశి
ఈ రాశివారు ఈ నెలలో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా వీరి పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. డిసెంబరు నెల అంటే ఈ రాశివారికి ఒకరకంగా అతి పెద్ద వైభవాన్ని తెచ్చిపెడుతుందనుకోవచ్చు.
సింహరాశి
ఆర్థికంగా వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ఆరోగ్యంపై మాత్రం ఎంతో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. డిసెంబరు నెలలో వీరికి అదృష్టం బాగా కలిసివస్తుంది. ఉద్యోగస్తులు వారి కార్యాలయాల్లో ఒత్తినిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్ని సులువుగా అధిగమించడం నేర్చుకోవాలి.












Click it and Unblock the Notifications