రాహువు వల్ల ఈ రాశులకు రెండుసార్లు దీపావళి.. కనక వర్షం!
నీడ గ్రహంగా పేరు తెచ్చుకున్న రాహువు ప్రతి 18 నెలలకు ఒకసారి రాశిని మారుస్తుంటాడు. దీపావళి తర్వాత తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్న రాహువు శతభిష నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. దీనికి రాహువే అధిపతి. సొంత నక్షత్రం కావడంతో మూడు రాశులవారికి విశేష ప్రయోజనాలు సిద్ధించనున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. మొత్తం 12 రాశులపై ఈ ప్రభావం ఉంటున్నప్పటికీ ప్రధానంగా మూడు రాశులకు మాత్రం అనేక లాభాలు కలగనున్నాయని చెబుతున్నారు.
ధనుస్సు రాశి
జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొన్న ఒత్తిడి మాయమవుతుంది. సంపద పెరిగి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. అనేక మార్గాల ద్వారా అదనంగా డబ్బు సంపాదిస్తారు. రాహువు అనుగ్రహం ఉండటంవల్ల డబ్బుల పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకుంటుంది. కెరీర్ తోపాటు వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది. పలు లాభాలున్నాయి.

కన్యా రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వీటితోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మాటతీరు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అది వివాదాలకు కారణమవుతుంది. శుభ ఫలితాలను అందుకుంటారు. కెరీర్ బాగుంటుంది. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వేతనం పెరగడంతోపాటు పదోన్నతికి అవకాశం ఉంది. రాహువు వల్ల ఈ రాశివారికి చాలా కలిసివస్తుందని పండితులు తెలియజేస్తున్నారు.
మేష రాశి
ఉద్యోగస్థులకు, వ్యాపారస్తులకు బాగుంటుంది. అదృష్టం కలిసివచ్చు అందలం ఎక్కుతారు. గతంలో నుంచి కొనసాగుతున్న వివాదాలన్నీ ఈ సమయంలో పరిష్కారమవుతాయి. కొత్త కొత్త ప్రాజెక్టులను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తిచేస్తారు. అత్యధిక లాభాలను కూడా పొందుతారు. అంతా సానుకూలంగా ఆలోచిస్తారు. కెరీర్ పరంగా కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications